2 భాగాల ల్యాపీ.. చెఫ్... ఐస్‌క్రీమ్ రోబో
టెక్నాలజీ పండగగా పిలిచే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) లాస్ వెగాస్‌లో కొనసాగుతోంది. ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో మూడో రోజు ప్రదర్శించిన ఆసక్తికర గ్యాడ్జెట్స్ ఇవీ.
స్మార్ట్‌గా కోసేయొచ్చు
గార్డెన్‌లో పెరిగిన గడ్డిని స్మార్ట్‌గా కోయడానికి ఈ గోట్ జీఎక్స్ ఉపయోగపడుతుంది. ఎకోవాక్స్ రోబోటిక్స్ అనే సంస్థ దీన్ని రూపొందించింది.
ఆటోమేటిక్ డ్రింక్
బీర్, కాక్‌టైల్ ప్రియుల కోసం ఐగులు అనే సంస్థ ఎఫ్1 పేరుతో ఆటోమేటిక్ బ్రూయింగ్ మెషీన్‌ను తయారు చేసింది.
కావాల్సింది చెప్తే...
ఇది ఆటోమేటిక్ చెఫ్. మీకు కావాల్సిన పదార్థం చెబితే.. దాన్ని వండి బౌల్‌లో మీకు అందిస్తుంది. పుల్‌మోనే రూపొందించిన దీని పేరు యో కాయ్ ఎక్స్‌ప్రెస్ రోబో చెఫ్.
చల్లని రోబో
ఫ్లేవర్ చెప్పు, సిరప్ ఏం వేయాలి, టాపింగ్స్ ఏంటి, మనీ పే చేస్తారా?.. ఇలా ఓ రోబో అడిగి మరీ ఐస్ క్రీమ్ చేసి ఇస్తే.. ఈ స్వీట్ రోబో అదే చేస్తుంది.
ఏఐ గ్రిల్
గ్రిల్ చికెన్, గ్రిల్ పనీర్ అంటే మీకు ఇష్టమా. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గ్రిల్‌ను చూడాల్సిందే. ఈ పెర్‌ఫెక్టా ఏఐ గ్రిల్‌ను సీర్ గ్రిల్స్ రూపొందించింది.
కియా పీవీ7.. స్పెషల్ కార్
సింగిల్ సీట్, డిఫరెంట్ స్టీరింగ్, వెనుక పెద్ద స్క్రీన్... ఏంటిది అనుకుంటున్నారా? ఇది కియా రూపొందించిన డిఫరెంట్ కాన్సెప్ట్ కారు. పీవీ7గా ఈ కారును పిలుస్తున్నారు.
టెక్ గార్డెన్
పైన ఫొటోలో కనిపిస్తున్నది స్మార్ట్ గార్డెన్. రైస్ గార్డెన్స్ రూపొందించిన దీని పేరు రైస్ రోమా హైడ్రోపోనిక్.
భలే మసాజర్
టెక్నాలజీ మసాజ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ ఫొటో తరహాలో ఉంటుంది. కాప్సిక్స్ రోబోటిక్స్ రూపొందించిన ఈ మసాజర్ పేరు ఐయూ ఏఐ మసాజర్.
రెండు భాగాలుగా ల్యాపీ
ఒకే ల్యాప్ టాప్ రెండు స్క్రీన్లు... ఆసుస్ జెన్‌బుక్ రూపొందించిన ల్యాపీ ప్రత్యేకత ఇది. ఇందులో స్క్రీన్‌ను మొబైల్ తరహాలో స్ప్లిట్ చేయొచ్చు. దీని పేరు జెన్‌బుక్ డ్యూయో స్ప్లిట్.
వణుకు తగ్గించే గ్లవ్
చేతులు వణకడం లాంటి ఇబ్బంది ఉన్నవాళ్ల కోసం గైరో గేర్ రూపొందించిన స్మార్ట్ గ్లవ్ ఇదీ. దీన్నిధరిస్తే చేతులు షేక్ అవ్వడం కంట్రోల్ అవుతుందట.
ముఖం చదివి... భవిష్యత్తు చెప్పి
ఊళ్లలో తిరునాళ్లప్పుడు జాతకం చెప్పే రోబో తరహా మెషీన్లు చూసే ఉంటారు. అందులో రికార్డెడ్ మాటలు వినిపిస్తాయి. ఈ డివైజ్ అయితే మీ ముఖకవళికలు చూసి చెబుతుందట. ఏఐ ఆధారంగా పని చేస్తుంది.
వీవోటీఎల్ ఎయిర్‌క్రాఫ్ట్
హ్యూందాయ్ మోటార్ గ్రూప్‌నకు చెందిన సూపర్‌నల్ రూపొందించిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇది. ఎలక్ట్రిక్ టైప్‌లో రూపొందించిన దీని పేరు సూపర్‌నల్ ఎస్ - ఏ2.