క్రికెట్‌కు రైనా గుడ్ బై
ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా... తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
Image:Twitter
భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రైనా క్రికెట్‌లో చాలా రికార్డులే నెలకొల్పాడు.
Image:Twitter
వన్డేల్లో 2005లో అరంగేట్రం చేసిన రైనా మొత్తం 226 వన్డేల్లో 5,615 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Image:Twitter
టెస్టు క్రికెట్‌లోకి 2010లో అడుగుపెట్టిన రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 7 అర్ధ శతకాలున్నాయి.
Image:Twitter
కెరీర్‌లో 78 అంతర్జాతీయ టీ20లు ఆడి 1,605 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Image:Twitter
భారత టీ20 లీగ్‌లో రైనా హవా మామూలుగా లేదు. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లలో రైనా ఒకడు.
Image:Eenadu
టీ20 లీగ్‌లో చెన్నై, గుజరాత్ తరఫున మొత్తం 205 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 39 అర్ధ సెంచరీలు బాదాడు.
Image:Eenadu
రైనా పార్ట్ టైమ్ బౌలర్ కూడా. స్పిన్ బౌలింగ్‌తో వన్డేల్లో 36, అంతర్జాతీయ టీ20ల్లో 13, టెస్టుల్లో 13, భారత టీ20 లీగ్‌లో 25 వికెట్లు తీశాడు.
Image:Eenadu
ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లలో రైనా ఒకడు. భారత టీ20 లీగ్‌లో 108, టెస్టుల్లో 23, వన్డేల్లో 102, అంతర్జాతీయ టీ20ల్లో 42 క్యాచ్‌లు అందుకున్నాడు.
Image:Eenadu
భారీ సిక్సర్లు బాదే రైనా భారత టీ 20 లీగ్‌లో 203, వన్డేల్లో 120, అంతర్జాతీయ టీ20ల్లో 58, టెస్టుల్లో 4 సిక్స్‌లు బాదాడు.
Image:Eenadu
రైనా మూడు ఫార్మాట్లలోనూ మూడంకెలకుపైగా వ్యక్తిగత స్కోరు సాధించాడు. టెస్టుల్లో సురేశ్ అత్యధిక స్కోరు 120 కాగా, వన్డేల్లో 116, అంతర్జాతీయ టీ20ల్లో 101.
Image:Eenadu