‘సరోగసీ’పై వచ్చిన చిత్రాలివీ..!
యశోద(2022)
తాజాగా సమంత నటించిన చిత్రం ‘యశోద’. సరోగసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Image:Twitter
స్వాతిముత్యం(2022)
సరోగసీ గర్భధారణలో భాగంగా హీరో వీర్యదానం చేసి ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. బెల్లంకొండ గణేశ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు.
Image: Twitter
మిమీ(2021)
బాలీవుడ్ హీరోయిన్ అవ్వాలని కలలు కనే యువతి.. డబ్బుల కోసం విదేశీ జంట కోరిక మేరకు సరోగసీ తల్లిగా మారుతుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాళ్లే కథ. మిమీ రాథోడ్‌గా కృతి సనన్ నటించింది. ఇందులో నటనకు గానూ కృతికి ఐఫా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి.
Image: Twitter
వెల్‌కమ్ ఒబామ(2013)
విదేశీయురాలు అద్దె గర్భం ద్వారా బిడ్డను కనాలని భారత్‌కు చెందిన ఓ మహిళను ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. సింగీతం శ్రీనివాస్ రావు తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రను ఊర్మిళ కొఠారీ పోషించింది.
Image: Wikipedia
ఫిల్‌హాల్ (2002)
ఈ చిత్రంలో మంచి స్నేహితులుగా టబు, సుస్మితా సేన్ నటించారు. టబుకి పిల్లలు కనే అదృష్టం లేదని తెలియడంతో సరోగసీ విధానంలో బిడ్డను కని ఇవ్వాలని సుస్మిత నిర్ణయించుకుంటుంది.
Image: Wikipedia
చోరీ చోరీ చుప్‌కే చుప్‌కే(2001)
సల్మాన్‌ఖాన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా కలిసి నటించిన చిత్రమిది. ఇందులో సల్మాన్, రాణి దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో సరోగసీని ఆశ్రయిస్తారు. సరోగసీ తల్లిగా మారడానికి ప్రీతి జింటా ముందుకొస్తుంది.
Image: Wikipedia
9 నెలలు (2001)
ప్రమాదంలో గాయపడ్డ తన భర్తను బతికించుకునేందుకు సరోగసీ విధానంలో తల్లిగా మారేందుకు సిద్ధపడ్డ మహిళ కథే ‘9 నెలలు’. ప్రధాన పాత్రను సౌందర్య పోషించింది.
Image: Wikipedia
దశరథమ్(1989)
ఈ చిత్రంలో ఏ లక్ష్యం లేని ధనవంతుడిగా మోహన్‌లాల్ నటించారు. తన స్నేహితుడి పిల్లల్ని చూసి తనకూ పిల్లలు కావాలని ఆశపడతారు. సరోగసీ విధానంలో తండ్రి అయ్యేందుకు ఓ జంటను సంప్రదిస్తారు.
Image: Wikipedia
దూస్రీ దుల్హాన్ (1983)
ఇందులో పిల్లలు పుట్టే భాగ్యంలేని దంపతులు వారికి ఓ బిడ్డను కనివ్వడానికి వేశ్యని ఎంచుకుంటారు. షబానా అజ్మీ, షర్మిలా ఠాకూర్, విక్టర్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు.
Image: Wikipedia