15 ఏళ్లకే నటనను ప్రారంభించి..

ఇప్పుడు టాలీవుడ్‌కి వచ్చి..

ఆర్‌.జే బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూర్య 45’లో స్వాసిక సందడి చేయనుంది.

నితిన్‌ హీరోగా, శ్రీరామ్‌ వేణు రూపొందిస్తున్న చిత్రం ‘తమ్ముడు’లో ఓ కీలక పాత్రతో తెలుగు తెరకు కూడా పరిచయం కానుంది. 

స్వాసిక అసలు పేరు పూజా విజయ్‌. ఇంట్లో అందరూ ముద్దుగా పారు అని పిలుస్తారు. 

చిన్నప్పటి నుంచి మ్యూజిక్‌, డ్యాన్స్‌పై ఇష్టంతో బ్యాచిలర్‌ ఆఫ్ ఆర్ట్స్‌ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసింది. 

పుట్టిపెరిగింది కేరళలోని ఎర్నాకులం. 15 ఏళ్లకే నటనను ప్రారంభించి కెరీర్‌ తొలినాళ్లలో యాంకర్‌గా చేసింది.

సీరియల్స్‌లో నటిస్తూనే షార్ట్‌ఫిల్మ్స్‌, మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో ఆడిపాడింది. డ్యాన్సర్‌గా స్టేజ్‌ ప్రదర్శనలూ ఇచ్చింది.

2024లో స్వాసిక, ప్రేమ్‌ జాకబ్‌ని పెళ్లాడింది. వీరిద్దరు

‘మనం పోల్ మాంగళ్యం’ అనే మలయాళ సీరియల్‌లో కలసి నటించారు. 

ప్రకృతిలో ప్రతి అణువు ఆస్వాదించాలనే స్వాసిక ప్రకృతి అందాలను ఫొటోలు, రీల్స్‌ తీసి తన ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.  

ఆమె నటించిన తమిళ చిత్రం ‘లబ్బర్‌ పందు’ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. ఆమెకు వరుస అవకాశాలనూ తెచ్చిపెట్టింది.

‘అమ్మే నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. తనతో కలసి చేపల వేపుడు చేయడం అంటే ఇష్టం’ అని అమ్మపై ప్రేమను వివరించింది.

‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

‘దబిడి దిబిడి’.. ఊర్వశి సందడి

ఓటీటీలో.. గ్రేటెస్ట్‌ కార్‌ మూవీస్‌

Eenadu.net Home