చిలగడ దుంప మధుమేహులకు ఆరోగ్యకరం..!

image:rkc

అన్ని దుంపల కంటే భిన్నమైన ప్రయోజనాలను చిలగడ దుంప అందిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది.

image:rkc

ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.

image:rkc

పొటాషియం అధికంగా ఉండటంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్త ప్రసరణ బాగుండేలా చేస్తుంది.

image:rkc

క్యాన్సర్‌ కారకాలు దరిచేరకుండా చేస్తుంది. క్యాన్సర్‌ వచ్చినా తగ్గించేలా దోహదపడనుంది.

image:rkc

ఎదిగే పిల్లలకు ఈ దుంపను ఉడికించి పెట్టడంతో మానసిక ఎదుగుదల బాగుంటుంది. 

image:rkc

కండరాలు, నరాల బలహీనతను అరికడుతుంది. విటమిన్లు ఈ, సి,బి6, ఐరన్‌ ఎక్కువగా లభించడంతో మేలు జరుగుతుంది.

image:rkc

విటమిన్‌ సి ఎక్కువగా ఉండటంతో చలి కాలంలో వచ్చే ఫ్లూ సమస్యను దూరం చేస్తుంది. 

image:rkc

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరాను సక్రమంగా అందేలా చూస్తుంది.

image:rkc

గాయాలయితే తొందరగా తగ్గేలా చేస్తుంది. చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి.

image:rkc

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home