పోలీస్‌ స్టోరీతో.. శ్వేతా అవస్తి..

శ్వేతా అవస్తి.. ‘మళ్లీ మళ్లీ చూశా(2019)’, ‘మెరిసే మెరిసే(2021) చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు ‘పోలీస్‌ స్టోరీ’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

హీరో శ్రీనాథ్‌ మాగంటి సరసన శ్వేత నటిస్తోంది. దీనికి రామ్‌ విగ్నేశ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది థ్రిల్లర్‌ మూవీ.. జులై 28న ఈటీవీ విన్‌ ఓటీటీలో విడుదల కానుంది.

చాలా కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న శ్వేతకి ఈ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నట్లు చెబుతోంది.

మరో యంగ్‌ హీరో నరేష్‌ అగస్త్య సరసన ‘దిల్‌వాలా’ అనే చిత్రంలో కూడా నటించింది. 2022లోనే షూటింగ్‌ ప్రారంభమయింది. ఇది కూడా ఈ సంవత్సరమే విడుదల కానున్నట్లు సమాచారం.

ఈ సందరి 1991లో పుణెలో పుట్టింది. చదువు మొత్తం అక్కడే సాగింది. కాలేజీలో చదువుతున్నప్పుడే యాక్టీవ్‌గా డ్యాన్స్‌ చేయటం, పాటలు పాడటం వంటివి చేసేది.

చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఓ ప్రైవేటు కంపెనీలో రీసెర్చి ఎనలిస్ట్‌గా పనిచేసింది.. ఆ తర్వాత మోడలింగ్‌ ద్వారా నటనలోకి అడుగుపెట్టింది. ఫెమినా నుంచి ‘బ్యూటీఫుల్‌ స్మైల్‌’ టైటిల్‌ను అందుకుంది.

ఈ పుణె భామ పలు హిందీ వీడియో పాటల్లో కూడా నటించింది. అంతేకాకుండా కొన్ని స్కిన్‌ కేర్‌ ప్రొడక్ట్స్‌కి, నగల వ్యాపారాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. 

ఒత్తిడి నుంచి బయట పడాలంటే ఏదో ఒక హాబీ ఉండాలి. నేనైతే ఒత్తిడి, ఆందోళన అనిపించినప్పుడు పెయింటింగ్‌ వేస్తాను అంటోంది ఈ సుందరి.  

photos: instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home