రూ.11,300 కోట్ల స్విగ్గీ ఐపీఓ

ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వస్తున్న అతిపెద్ద ఐపీఓల్లో ఇదీ ఒకటి.

స్విగ్గీ ఐపీఓ ద్వారా సుమారు రూ.11,300 కోట్ల నిధుల్ని సమీకరించబోతోంది.

ఈ పబ్లిక్‌ ఇష్యూ నవంబరు 6-8 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ధరల శ్రేణి రూ.371-390గా కంపెనీ నిర్ణయించింది. యాంకర్‌ మదుపర్లు నవంబర్‌ 5 నుంచే బిడ్లు దాఖలు చేయొచ్చు.

ఐపీఓలో తాజా షేర్ల జారీ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించనున్నారు.

ప్రస్తుత వాటాదార్లు విక్రయించడం ద్వారా మరో రూ.6,800 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో 18.23 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. 

రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 38 షేర్లు (ఒక లాట్‌) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో లాట్‌ కోసం గరిష్ఠంగా రూ.14,820 వెచ్చించాలి.

విక్రయానికి ఉంచిన మొత్తం షేర్లలో 75% క్యూఐబీలకు, 15% ఎన్‌ఐఐలకు, 10శాతం రిటైలర్లకు కేటాయించనున్నారు.

 2023 మార్చి 31 నాటికి సంస్థ వార్షికాదాయం 1.09 బిలియన్‌ డాలర్లుగా ఉంది. సంస్థలో 4,700 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.

స్విగ్గీ షేర్లు నవంబర్‌ 13న మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి.

బడ్డెట్‌ ప్లాన్‌ చేద్దామిలా!

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

పన్నుప్రయోజనాలు అందించే పథకాలు ఇవే..

Eenadu.net Home