డిప్రెషన్‌ను ఈ లక్షణాలతో కనిపెట్టొచ్చు!

డిప్రెషన్‌లో ఉన్న వారికి ఆ విషయం తెలియకపోవచ్చు. వారిలో కనిపించే మార్పులను బట్టి వారు డిప్రెషన్‌లో ఉన్నారో లేదో ఎదుటివాళ్లు గుర్తించవచ్చు అదెలా అంటే..

Image: Unsplash

ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురికావడం. దేనిపై ఏకాగ్రత పెట్టలేకపోవడం.

Image: Unsplash

అకస్మాత్తుగా వారి ప్రవర్తనలో, భావోద్వేగాల్లో మార్పులు రావడం. అకారణంగా ఏడవటం.

Image: Unsplash

పలకరించినా సరిగా మాట్లాడకపోవడం. ఏదైనా అడిగితే నామమాత్రపు సమాధానాలు చెప్పి తప్పించుకొని వెళ్లడం.

Image: Unsplash

ఎంత కుదుటపర్చి నిద్రపుచ్చాలని చూసినా పడుకోకపోవడం. పడుకున్నా.. తొందరగా మెల్కోవడం. నిద్రలేమితో బాధపడటం.

Image: Unsplash

ఎక్కువగా తినేస్తుండటం లేదా అసలు ముద్ద ముట్టుకోకపోవడం.

Image: Unsplash

ప్రతి చిన్న విషయానికి చిరాకు/కోపం ప్రదర్శించడం. చిన్న సమస్యల గురించి తీవ్రంగా ఆలోచించడం.

Image: Unsplash

ప్రతి విషయంలో ప్రతికూల ఆలోచనలతో ఉండటం. మంచి కంటే చెడును ఎక్కువగా ఊహించుకోవడం.

Image: Unsplash

ఆశావాదం, నమ్మకం కోల్పోవడం. తనకు ఏదీ చేతకాదు అన్నట్లుగా ఆత్మన్యూనతతో బాధపడటం.

Image: Unsplash

పెద్దలు కుదిర్చితే.. దగ్గరవ్వడానికి ఇవి పాటించండి!

పోలిక.. నీకు తెలియని శత్రవు!

కేలొరీలు కరిగించండిలా...

Eenadu.net Home