హైపోథైరాయిడిజమ్‌... ముందే గుర్తిస్తే నయం!

థైరాయిడ్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గడాన్ని హైపోథైరాయిడిజమ్‌ అంటారు. వయసుతోపాటు ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. 

Image: RKC

ఈ హార్మోన్‌ తగినంత లేకపోతే అవయవాలు పనితీరు మందగిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. బరువు పెరగడం, మగత, చర్మం పొడిబారడం, మలబద్ధకం వంటి సమస్యలొస్తాయి. 

Image: RKC

ఈ సమస్య తలెత్తితే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించి తగిన చికిత్స తీసుకోవాలి. మరి హైపోథారాయిడిజమ్‌ లక్షణాలేంటో తెలుసుకుందామా...

Image: RKC

థైరాయిడ్‌ హార్మోన్‌ తగ్గినప్పుడు శరీరం కొలెస్ట్రాల్‌ను విడగొట్టలేదు. చెడు కొవ్వు పేరుకుపోయి.. రక్తంలో కొవ్వు మోతాదు పెరుగుతుంది. 

Image: RKC

హైపోథైరాయిడిజమ్‌ వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గి.. గుండె వైఫల్యానికి దారితీయొచ్చు. ఈ సమస్య తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో, కాళ్లలో నీరు చేరుతుంది. 

Image: RKC

థైరాయిడ్‌ హార్మోన్‌ తగ్గితే పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. ఫలితంగా మలబద్ధకం తలెత్తుతుంది.

Image: RKC

హైపోథైరాయిడిజమ్‌తో జీవక్రియల వేగం తగ్గుతుంది. దీంతో ఒంట్లో నీరు ఎక్కువవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లలోని పెద్ద కండరాలలో నొప్పులు మొదలవుతాయి.

Image: RKC

చిన్న వయసులో థైరాయిడ్‌ పనితీరు తగ్గితే.. డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వృద్ధుల్లోనూ కనిపిస్తుంది.

Image: RKC

జ్ఞాపకశక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటమూ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు కావొచ్చు.

Image: RKC

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

ఎందుకొచ్చిందీ తలనొప్పి?

Eenadu.net Home