టీ20 ప్రపంచ కప్ 2024.. ఆసక్తికర విషయాలు

టీ20 ప్రపంచ కప్‌ 2024 విజేతగా టీమ్ఇండియా నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి రెండోసారి పొట్టికప్‌ను అందుకుంది. 

ఈ సారి టీ20 వరల్డ్ కప్‌లో 20 దేశాలు పాల్గొన్నాయి. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధికం. 

తొలిసారి ప్రపంచ కప్‌ ఆడిన అమెరికా.. పాకిస్థాన్‌, కెనడాలను ఓడించి సూపర్‌-8 దశకు అర్హత సాధించింది

ఐసీసీ వరల్డ్‌ కప్‌ల్లో దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. 

అఫ్గానిస్థాన్‌ ఈ ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను ఓడించి సెమీ ఫైనల్‌ వరకు వచ్చింది.  

ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టీ20 వరల్డ్ కప్‌ ఛాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 

ఈ ప్రపంచ కప్‌లో ఒక్క సెంచరీ నమోదు కాలేదు. నికోలస్ పూరన్ (98), ఆరోన్ జోన్స్ (94), రోహిత్ శర్మ (92) శతకాలు మిస్‌ చేసుకున్నారు. 

టీమ్ఇండియా స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. 

ఫజల్‌ హక్‌ ఫారూఖీ (5/9), అకీల్‌ హొస్సేన్‌ (5/11) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశారు. ఉగాండాపైనే వీరిద్దరూ ఈ ఫీట్ సాధించడం విశేషం. 

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

IPL వేలం: వీళ్లకు ఊహించిన ధర కంటే ఎక్కువే!

IPL వేలం: ఈ ఏడాది టాపర్‌ పంత్‌.. మరి గతంలో?

Eenadu.net Home