టీ20 ప్రపంచకప్: భారత్ వర్సెస్ పాక్.. మనదే ఆధిపత్యం
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Image:SocialMedia
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (82; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) విశ్వరూపం ప్రదర్శించి జట్టుకు విజయాన్ని అందించాడు. మరి టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ల ఫలితాలపై ఓ లుక్కేద్దాం.
Image:SocialMedia
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ రెండుసార్లు తలపడ్డాయి.గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ టై కాగా.. బౌలౌట్‌లో భారత్ గెలుపొందింది.ఫైనల్ కూడా ఈ జట్లే మధ్యే జరిగింది. తొలుత భారత్ 158 పరుగుల చేయగా.. పాక్ 152 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియా కప్‌ని ఎగరేసుకుపోయింది.
Image:RKC
2012 టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 19.4 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా.. 17 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. కోహ్లీ (78) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు.
Image:RKC
2014 టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 10లో భారత్,పాక్ మ్యాచ్ జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దాయాది జట్టు.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇండియా 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Image:RKC
2016 టీ20 ప్రపంచకప్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్ 10లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన మ్యాచ్‌ని 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 118/5 చేసింది. 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో అందుకుంది.
Image:RKC
2021 టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12లో భారత్, పాక్ మరోసారి తలపడ్డాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా.. 151/7 స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని పాక్.. ఒక్క వికెట్ కోల్పోకుండా 17.5 ఓవర్లలో ఛేదించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్ చేతిలో భారత్‌కిదే ఏకైక ఓటమి.
Image:RKC