సిల్క్‌ చీరలో చిలక.. తాప్సీ

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న తాప్సీ పన్ను.. ‘గాంధారి’తో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.

 తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో గాంధారిగా తల్లి పాత్రలో నటిస్తోంది. 

దిల్లీకి చెందిన తాప్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేసింది. సినిమాల్లోకి రాకముందు ఆమె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 

 2010లో ‘ఝుమ్మంది నాదం’తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళంలో వరుస చిత్రాలు చేసింది.  

 డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మథియాస్‌ బో, తాప్సీ కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

 చీరకట్టు అంటే తాప్సీకి ఇష్టం. లైట్‌ వెయిట్‌ సిల్క్‌, జార్జెట్‌ శారీస్‌లో ఫొటోషూట్‌లతో ఇన్‌స్టాను హీటెక్కిస్తుంటుంది.

 ప్రముఖ మ్యాగజీన్ల కవర్‌ ఫొటోలకు పోజులిస్తూ ఉంటుంది. అలాగే చాలా బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. 

ఇన్‌స్టాలో తాప్సీకి ఓ రేంజ్‌లో ఫాలోవర్లు ఉన్నారు. దాదాపు 2కోట్ల మందికి పైగా ఆమెను అనుసరిస్తున్నారు. 

తాప్సీ పోలీసు పాత్రలో నటిస్తున్న ‘వో లడ్కీ హై కహా?’ విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఈ ఏడాది రొమాంటిక్‌ చిత్రం ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’తో ఆకట్టుకుంది. గతేడాది ‘ధక్‌ ధక్‌’, ‘డంకీ’తో అలరించింది.

లక్కీ భాస్కర్‌.. జీవిత సత్యాలు

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

Eenadu.net Home