ఈ రాజకీయ నేతల డ్రెస్సింగ్‌ స్టైల్‌ చూశారా!

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఖాదీ చీరలనే ఎంపిక చేసుకుంటారు.

Image: Twitter

ప్రధాని మోదీ ఎప్పుడూ కుర్తా, పైజామా, జాకెట్‌ వేసుకుంటారు. ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తే.. అక్కడి సంస్కృతికి అనుగుణంగా ఆయన వస్త్రధారణ ఉంటుంది.

Image: RKC

మాజీ ఉప రాష్ట్రపతి, భాజపా అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్యనాయుడు ఎక్కువగా చొక్కా, పంచె ధరించడానికి ఇష్టపడుతారు.

Image: Twitter

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ చాలా వరకు లేత, ముదురు రంగులు ఉండే ఖాదీ చీరలను ధరిస్తారు.

Image: RKC

రాహుల్‌గాంధీ టీషర్ట్‌ వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పార్టీ సమావేశాల్లో మాత్రం కుర్తా, పైజామా వేసుకుంటారు.

Image: RKC

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఖాదీలోనే ప్రత్యేకమైన చొక్కా, ప్యాంట్‌ వేసుకుంటారు. దశాబ్దాలుగా ఒకే దర్జీ దగ్గర వాటిని కుట్టిస్తున్నారట.

Image: RKC

తెలంగాణ మంత్రి, తెరాస నేత కేటీఆర్‌ యువతరానికి ప్రతినిధిగా ఉంటారు. సందర్భానుసారంగా టీషర్ట్స్‌, చొక్కా, ప్యాంట్‌ వేసుకుంటారు. విదేశీయులతో సమావేశమైనప్పుడు సూట్‌ ధరిస్తారు.

Image: RKC

తెదేపా అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన డ్రెస్సింగ్‌ స్టైల్‌ను కొన్ని దశాబ్దాలుగా అలాగే కొనసాగిస్తున్నారు. ముదురు గోధుమ రంగు చొక్కా, ప్యాంట్‌ ధరిస్తుంటారు. 

Image: RKC

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఖాదీ చీరను ధరిస్తారు. వివిధ రంగుల బార్డర్‌ ఉండే తెలుపు రంగు చీరలనే ఎక్కువగా ఇష్టపడతారు.

Image: Twitter

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సాదాసీదాగా ఉంటారు. సాధారణ ప్రజల మాదిరిగానే దుస్తులు వేసుకుంటారు. కొన్నేళ్లుగా పైజామా, లాల్చీనే ధరిస్తున్నారు.

Image: RKC

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అక్కడి సంస్కృతి ఉట్టిపడేలా తెలుపు రంగు చొక్కా, లుంగీ ధరిస్తారు.

Image: RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home