మిల్కీ బ్యూటీ.. ట్రెండింగ్‌ క్యూటీ!

‘వేద’తో ఇటీవల బాలీవుడ్‌లో అలరించిన తమన్నా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

తమన్నా వజ్రాల దొంగ పాత్రలో నటించిన ‘సికందర్‌ కా ముకద్దర్‌’ ఈనెల 29న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల కానుంది.

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ‘ఓదెల 2’లో శివశక్తిగా కనిపించనుంది. ఇందులో తన పాత్ర ప్రత్యేకంగా ఉండనుంది.

‘స్త్రీ 2’లో ‘ఆజ్‌ కీ రాత్‌’పాటతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఈమె డ్యాన్స్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

సినిమాలే కాకుండా వెబ్‌సిరీస్‌లతోనూ ఆకట్టుకుంటోంది. కిందటి ఏడాది ‘జీ కర్దా’, ‘ఆఖ్‌రి సాచ్‌’లో నటించింది. ఈ ఏడాది ‘డేరింగ్‌ పార్ట్‌నర్స్‌’తో రానుంది.

‘మమాఎర్త్‌ బ్యూటిఫుల్‌ ఇండియన్‌ 2024’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. విభిన్న దుస్తులతో నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారుతూంటుంది.

ప్రముఖ జ్యువెలరీ, దుస్తుల యాడ్‌లతో పాటు వివిధ మ్యాగజీన్‌ కవర్‌ ఫొటోలకు పోజులిస్తూ అలరిస్తోంది.

 ఖాళీ సమయం దొరికితే చాలు దాన్ని డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కే వినియోగిస్తుంది. దీని వల్ల బాడీ ఫిట్‌గా ఉంటుందని హెల్త్‌ టిప్‌ చెప్పింది.

తమన్నా క్రికెట్‌కు వీరాభిమాని. టీమిండియా క్రికెటర్లను ప్రోత్సహిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది.

ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 2 కోట్ల 74 లక్షలు. అందుకే తన ప్రతి పోస్టూ వైరల్‌ అవుతుంది.

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home