తెలుగుతెరపై తమిళ పొన్ను!
కన్నడ, మలయాళీ భామలే కాదు.. కోలీవుడ్ తారలు కూడా తెలుగుతెరపై అలరిస్తున్నారు.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో నాయిక వచ్చి చేరింది. తనే.. అతుల్యా రవి.
Image: Instagram/Athulyaa Ravi
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతోన్న ‘మీటర్’లో అతుల్య హీరోయిన్‌గా నటిస్తోంది.
Image: Instagram/Athulyaa Ravi
ఈ తమిళ పొన్ను కోయంబత్తూరులో 1994 డిసెంబర్ 21న జన్మించింది.
Image: Instagram/Athulyaa Ravi
ఇంజినీరింగ్ చదివిన ఈ భామ.. చదువుకునే రోజుల్లో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. అది వైరల్ కావడంతో సినిమా అవకాశాలు వచ్చాయి.
Image: Instagram/Athulyaa Ravi
అలా తమిళ్‌లో ‘కాదల్ కన్ కట్టుదే’తో తెరంగేట్రం చేసింది అతుల్య. ఆ తర్వాత వరసపెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు పదికిపైగా సినిమాల్లో నటించింది.
Image: Instagram/Athulyaa Ravi
‘మీటర్’ దర్శకుడు రమేశ్ కాదూరి అతుల్యని సంప్రదించి.. ఆడిషన్ తీసుకున్నాడు. తను అనుకున్న పాత్రకు సూట్ అవడంతో అతుల్యను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు.
Image: Instagram/Athulyaa Ravi
ప్రపంచ ఖ్యాతి గడించిన తెలుగు సినీఇండస్ట్రీలో భాగం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అతుల్య గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
Image: Instagram/Athulyaa Ravi
చాలా కాలంగా తెలుగు సినిమాల్లో నటించాలని అనుకుంటుందట.. ఎట్టకేలకు ‘మీటర్’తో తన కోరిక నెరవేరిందని అంటోంది.
Image: Instagram/Athulyaa Ravi
తెలుగు భాష కాస్త తెలుసట. సినీ ప్రమోషన్స్‌లో తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంటోంది. తెలుగు పూర్తిగా నేర్చుకుంటానని చెబుతోంది.
Image: Instagram/Athulyaa Ravi
‘మీటర్’ ప్రమోషన్స్‌లో భాగంగా అతుల్య.. మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. ‘నా జీవితంలో మర్చిపోలేని క్షణం ఇది’ అంటూ చిరుతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేసింది.
Image: Instagram/Athulyaa Ravi
గ్లామర్ పాత్రలు నచ్చవు. కానీ, కథలో పాత్రకు ప్రాధాన్యముంటే.. గ్లామర్‌గా కనిపించడానికి సిద్ధమేనని అంటోంది అతుల్య.
Image: Instagram/Athulyaa Ravi