డిమోంటి కాలనీ 2 నుంచి 2కె లవ్‌స్టోరీ వరకూ..
గతేడాది ‘డిమోంటి కాలనీ 2’తో అలరించిన మీనాక్షి గోవిందరాజన్ ఈ సంక్రాంతికి ‘2కె లవ్‌స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
2019లో ‘కెన్నడీ క్లబ్’తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
‘వేలన్’, ‘వీరపాండ్యాపురం’, ‘కోబ్రా’, వంటి చిత్రాలతో అలరించింది.
‘కాదలే కాదలే’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
2000 సంవత్సరంలో మథురైలో పుట్టింది. చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ‘శరవణం మీనాచ్చి 3’, ‘విల్లా టు విలేజ్’ టెలివిజన్ షోస్‌లో నటించింది.
ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి ట్రిప్పులు, పార్టీల్లో సందడి చేస్తుంటారు.
పారిస్ నగరమంటే ఇష్టం. ఏడాదికోసారైనా వెళ్లడం.. అక్కడి పెర్‌ఫ్యూమ్‌లను కొనుగోలు చేయడం పక్కా.
‘నా ఫేవరెట్ హీరో విక్రమ్‌తో కలిసి ‘కోబ్రా’లో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. సెట్‌లో విక్రమ్‌ని చూసినప్పుడల్లా ఎగ్జైట్ ఫీలయ్యేదాన్ని’ అని చెప్పింది.
డ్యాన్స్ చేయడం నచ్చుతుంది. ఖాళీ సమయం దొరికితే స్టూడియోకి వెళ్లి డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తుంది. ఆ వీడియోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది.
‘శారీ కడితే పిక్ పక్కా..’ అంటూ రకరకాల చీరలతో దిగిన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.
మథురైలోని శ్రీకృష్ణుడిని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి దూరమవుతుందని చెబుతోంది.