మాలీవుడ్ బ్యూటీ ‘క’తో టాలీవుడ్‌ ఎంట్రీ..

కిరణ్‌ అబ్బవరం సరసన ‘క’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది తన్వీ రామ్‌. ఈ చిత్రం నవంబరు 18న విడుదల కానుంది.

సుజిత్‌, సందీప్‌ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. ఇందులో మరో నాయిక నయన్‌ సారిక.

2019లో ‘అంబిలి’తో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది తన్వీ. ‘కప్పెలా’, ‘ఆరట్టు’, ‘తళ్లుమాల’ తదితర చిత్రాల్లో నటించింది.

ఇంతకు ముందు తెలుగులో నాని ‘అంటే సుందరానికీ’లో అతిథి పాత్రలో కనిపించింది. కానీ, అంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు ‘క’తో హీరోయిన్‌గా మెరవనుంది. 

2023లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘2018’లో మంజు పాత్రలో కనిపించింది. ఈ చిత్రం ద్వారా ఈ భామకి మంచి గుర్తింపు దక్కింది.

తన్వీ పుట్టింది కేరళలో. చిత్రపరిశ్రమలోకి రాకముందు దాదాపు ఏడేళ్ల పాటు బ్యాంక్‌లో ఉద్యోగం చేసింది. 

మోడలింగ్‌లో రాణించింది. అందాల పోటీల్లోనూ పాల్గొంది. 2012లో మిస్‌ కేరళ ఫైనలిస్టుల జాబితా వరకూ చేరి రన్నరప్‌గా నిలిచింది.

ఆ తర్వాత పలు యాడ్స్‌, టెలివిజన్‌ అవకాశాలు రావడం మొదలయ్యాయి. కెమెరా భయం పోగొట్టుకోవడానికి ఆమెకు రెండు వారాల సమయం పట్టిందట.

షూటింగ్‌ లేని సమయంలో తన్వీ కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతుంది. ‘అది చాలా విలువైన సమయం. నా ఒత్తిడినంతా తగ్గిస్తుంది’ అని చెబుతోంది.

ప్రకృతిలో గడపడం తన్వీకి బాగా ఇష్టం. తరచూ విహారయాత్రలకు వెళుతుంది. పురాతన కట్టడాలను సందర్శించడమంటే ఎంత ఇష్టమో..!

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home