మూడేళ్ల గ్యాప్‌ తర్వాత తన్వీ

మూడేళ్ల తర్వాత ‘ఉషా పరిణయం’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చింది తెలుగమ్మాయి తన్వీ ఆకాంక్ష.

విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదలైంది.

‘అలాంటి సిత్రాలు’తో 2021లో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తన్వీ.. ఆ తర్వాత మళ్లీ ‘ఉషా పరిణయం’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

‘ఉషా పరిణయం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు లైట్‌ కలర్‌ నెట్టెడ్‌ శారీలో తళుక్కున మెరిసింది.

హైదరాబాద్ (1993)లో పుట్టిన తన్వీ.. మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది.

This browser does not support the video element.

నటన మీదున్న ఆసక్తితో మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అలా మిస్‌ హైదరాబాద్‌ కిరీటాన్నీ గెలుచుకోవడంతో పాటు ‘అలాంటి సిత్రాలు’లో ఛాన్స్‌ కొట్టేసింది.

స్విమ్మింగ్‌, డ్యాన్స్‌ చేయడం ఈమె హాబీలు. ‘కష్టం వచ్చినా, కోపం వచ్చినా పాటలు వింటా’నంటోంది ఈ బ్యూటీ.

ఖాళీ సమయం దొరికితే పెయింటింగ్‌ చేస్తుంది. దీనివల్ల రిఫ్రెష్‌ అవ్వడంతో పాటు దాన్ని చూసుకున్నప్పుడల్లా సంతోషంగా అనిపిస్తుందట.

సైకిల్‌ తొక్కడమంటే మహా ఇష్టం. అప్పుడప్పుడూ ఉదయాన్నే సైకిల్‌ వేసుకొని అలా తిరిగొస్తే ఆ సంతోషమే వేరని అంటోంది.

తన్వీకి పరికిణీ, ఓణీలు అంటే చాలా ఇష్టం. పండుగలూ, ప్రత్యేక సందర్భాలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. పట్టు ఓణీల్లో సందడి చేస్తుంటుంది. 

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home