అతిగా టీ తాగుతున్నారా...

కొంతమందికి రోజు మొదలయ్యేది ‘టీ’తోనే. ఇక వర్షాకాలంలో అయితే.. రోజుకి కనీసం నాలుగైదు సార్లు తాగుతూనే ఉంటారు. మరి అతిగా టీ తాగితే వచ్చే అనర్థాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

image: unsplash

వికారం..

తలనొప్పిని తగ్గిస్తుందని ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో టీని తీసుకుంటే అది వికారానికి దారి తీస్తుంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి.. అనారోగ్య సమస్యలొస్తాయి.

image: rkc

వ్యసనం..

శరీరానికి టీని ఎక్కువగా అలవాటు చేస్తే దానిపై పూర్తిగా ఆధారపడిపోతూ ఉంటాం. రోజూ ఆ సమయానికి టీ తాగకపోతే తలనొప్పి, చిరాకు వంటివి వస్తాయి.

image: unsplash

నిద్ర దూరం...

టీని మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఒత్తిడి తగ్గి శరీరానికి ప్రశాంతంగా ఉంటుంది. అదే ఎక్కువ సార్లు తాగితే నిద్రను కూడా దూరం చేస్తుంది. దాంట్లో ఉండే కెఫిన్‌ నిద్రపట్టనివ్వదు.

image: rkc

డీహైడ్రేషన్‌...

టీని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. నీరు ఎక్కువగా తీసుకున్నా టీలో ఉండే రసాయనాలు శరీరానికి నీటిని గ్రహించనివ్వవు.

image: unsplash

ఐరన్‌ లోపం...

టీలో టానిన్స్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి ఐరన్‌ని కూడా గ్రహించనివ్వవు.. దీంతో శరీరంలో ఐరన్‌ లోపంతో ఎనీమియా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

image: rkc

దంత సమస్యలు..

ముఖ్యంగా బ్లాక్‌ టీతో దంత సమస్యలు అధికంగా వస్తాయి. దీంట్లో ఉండే రసాయనాలతో దంతక్షయం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల టీని మితంగా తీసుకుంటూ, దంతాలను శుభ్రం చేసుకోవాలి.

image: unsplash

గుండెల్లో మంట..

టీ, కాఫీల్లో ఉండే కెఫిన్‌ పేగుల్లో ఆమ్లం ఉత్పత్తి చేస్తుంది. దాని మూలంగా కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. గుండెల్లో మంట, కడుపులో నొప్పి తదితర సమస్యలు బాధిస్తాయి. ఖాళీ కడుపుతో టీని అసలే తీసుకోకూడదు.

image: rkc

రక్తపోటు, మధుమేహం..

బ్లాక్‌టీలో ఉండే రసాయనాలు రక్తపోటు, మధుమేహం బారిన పడేందుకు దోహదపడతాయి. రోజుకి ఒక కప్పుకి మించి బ్లాక్‌టీని తీసుకుంటే ప్రమాదమేనని గుర్తుంచుకోండి.

image: unsplash

నెలసరి తప్పుతోందా? కారణాలివేనేమో చూడండి..

తామర గింజలతో ప్రయోజనాలెన్నో..!

ఈ ఆహార పదార్థాలతో దంతాలకు ముప్పు

Eenadu.net Home