ఆసియా కప్‌లో భారత్‌ ఎన్ని టైటిళ్లు గెలిచిందంటే?

 ఈ టోర్నీని రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఇప్పటివరకు 14 సార్లు జరగ్గా.. అత్యధికంగా టీమ్‌ఇండియా ఏడుసార్లు విజేతగా నిలిచింది. మరి ఎప్పుడు, ఏ దేశంపై గెలిచిందో తెలుసుకుందాం రండి.

image:Twitter

1984లో మొట్టమొదటిసారిగా యూఏఈ వేదికగా నిర్వహించిన ఆసియా కప్‌ పోటీల్లో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

image:Twitter

1988 ఆసియా కప్‌ పోటీలు బంగ్లాదేశ్‌ వేదికగా జరిగాయి. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ 76 రన్స్‌తో మెరిశాడు.

image:Twitter 

1990/91 పోటీలకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన తుది పోరులో లంకేయులపై టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది.

image:Twitter

1995 ఆసియా కప్‌ పోటీలను యూఏఈలో నిర్వహించారు. షార్జా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓడించి హ్యాట్రిక్‌ కొట్టింది. ఈ మూడు సార్లు ప్రత్యర్థి శ్రీలంకే కావడం విశేషం.

image:Twitter

వరుసగా 3 సార్లు కప్‌ ఎగరేసుకుని పోయిన టీమ్‌ఇండియాకు తర్వాతి టైటిల్‌ని సాధించడానికి 15 ఏళ్లు పట్టింది. 2010లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

image:Twitter

2016లో ఆసియా కప్‌ పోటీలను తొలిసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. మిర్పూర్‌ వేదికగా జరిగిన తుదిపోరులో బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

image:Twitter

యూఏఈ వేదికగా నిర్వహించిన 2018 ఆసియా కప్‌ పోటీల్లోనూ భారత్‌యే విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో టీమ్‌ఇండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది.

image:Twitter 

2022 ఆసియా కప్‌ పోటీలు కూడా యూఏఈలో జరగనున్నాయి. తొలుత శ్రీలంక వేదికగా నిర్వహించాలని నిర్ణయించినా.. అక్కడ రాజకీయ అనిశ్చితి కారణంగా వేదికను యూఏఈకి మార్చారు. ఈ ఏడాది ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చూడాలి మరి.

image:Twitter

రోహిత్‌ @ 250.. 200 క్లబ్‌లో ఇంకెవరు?

ఐపీఎల్‌లో జట్ల అత్యల్ప స్కోర్స్‌ ఇవీ!

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలివీ!

Eenadu.net Home