ఆసియా కప్ పోటీకి టీమ్‌ఇండియా రెడీ
రోహిత్ శర్మ (కెప్టెన్)
ఆసియా కప్ కోసం కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఎలాంటి మార్పు చేయలేదు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగించారు. 2018 ఆసియా కప్‌నకు కూడా హిట్‌మ్యాన్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
image:eenadu
కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్)
హెర్నియా సర్జరీ, ఆ తర్వాత కరోనా కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
image:eenadu
విరాట్ కోహ్లీ
వెస్టిండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో పునరాగమనం చేశాడు.
image:eenadu
సూర్యకుమార్ యాదవ్
గత కొంత కాలంగా నిలకడగా ఆడుతూ టీమ్‌ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ని ఆసియా కప్ జట్టులోనూ కొనసాగించారు.
image:Twitter
దీపక్ హుడా
ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన దీపక్ హుడా తొలిసారి ఆసియా కప్‌నకు ఎంపికయ్యాడు.
image:Twitter
రిషభ్ పంత్
టీమ్‌ఇండియా యువ ఆటగాడు, రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా మొదటిసారి ఆసియా కప్‌లో ఆడనున్నాడు. image:Twitter
దినేశ్ కార్తీక్
గత కొంత కాలంగా మంచి ఫామ్‌లో ఉన్న వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2018 ఆసియా కప్‌లో ఇతడు కీలకపాత్ర పోషించాడు.
image:eenadu
హార్దిక్ పాండ్య
2018 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడి టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సిరీస్‌ల్లో ఆడి ఫామ్‌లోకి వచ్చిన పాండ్య.. 2022 ఆసియా కప్‌నకు ఎంపికయ్యాడు.
image:eenadu
రవీంద్ర జడేజా
టీమ్‌ఇండియా కీలక ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ఒకడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. image:eenadu
భువనేశ్వర్ కుమార్
ఆ మధ్య ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన భువనేశ్వర్ కుమార్ మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 20 వికెట్లు తీసిన అతడు ఆసియా కప్‌లోనూ ఆడనున్నాడు.
image:Twitter
యుజువేంద్ర చాహల్
ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మేటి స్పిన్నర్ యుజువేంద్ర చాహల్. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన చాహల్.. ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
image:Twitter
రవిచంద్రన్ అశ్విన్
అనుభవజ్ఞుడైన రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
image:eenadu
రవి బిష్ణోయ్
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్ ప్రమోషన్‌లో భాగంగా ఆసియా కప్‌నకు ఎంపికయ్యాడు.
image:Twitter
అర్ష్‌దీప్ సింగ్
భారత టీ20 లీగ్‌లో రాణించి ఇటీవల టీమ్‌ఇండియా అరంగేట్రం చేసిన యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ సారి ఆసియా కప్‌లో భారత జట్టుకు కీలకం కానున్నాడు.
image:Twitter
అవేశ్ ఖాన్
అవేశ్ ఖాన్ కూడా ఇటీవల భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ యువ పేసర్ టీమ్‌ఇండియాకు కీలకం
.image:Twitter
స్టాండ్ బైగా ముగ్గురు
శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్‌లను సెలక్టర్లు స్టాండ్ బై ఆటగాళ్ల కింద ఎంపిక చేశారు. ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ఆరంభం కానుంది.
image:Twitter