టీమ్‌ఇండియా @ 1

భారత్ జట్టు మూడు ఫార్మాట్లలోనూ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించింది.

టెస్టుల్లో టీమ్‌ఇండియా 118 పాయింట్లతో తొలి ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (118), ఇంగ్లాండ్‌ (115) ఉన్నాయి.

ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. దీంతో వన్డే ఫార్మాట్‌లోనూ భారత్‌ (116 పాయింట్లు) నెంబర్‌వన్ అయింది. పాక్‌ (115), ఆస్ట్రేలియా (115) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

టీ20ల్లోనూ భారత్‌దే హవా. ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా 264 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. ఇంగ్లాండ్‌ 261 పాయింట్లు, పాకిస్థాన్‌ 254 పాయింట్లతో తర్వాత ఉన్నాయి.

జట్టుపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ కొన్ని విభాగాల్లో భారత్‌ ఆటగాళ్లు అగ్రస్థానం సాధించారు. టీ20ల్లో సూర్యకుమార్‌ (889) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

తాజాగా వన్డేల్లో మహమ్మద్‌ సిరాజ్‌ (694) బౌలింగ్‌ విభాగంలో టాప్‌ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. జోష్ హేజిల్‌వుడ్ (678), ట్రెంట్‌ బౌల్ట్‌ (677)ను అధిగమించాడు.

టెస్టు విభాగంలోనూ భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌ (879) అగ్రస్థానంలో ఉన్నాడు. 

టెస్టుల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (455) టాప్‌లో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్‌ (370) రెండో ర్యాంక్‌ కావడం విశేషం.

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home