WTC ఫైనల్‌కు భారత్‌ చేరిందిలా!

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జూన్‌ 7 నుంచి 11 వరకు జరగనుంది. ఈ తుదిపోరులో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 2021-23 మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఫలితాలను బట్టే ఫైనల్‌కు భారత్‌ అర్హత సాధించింది. ఆయా టెస్టుల్లో భారత్‌ ప్రదర్శనపై లుక్కేస్తే.. 

Image: Twitter/Bcci

ఇంగ్లాండ్‌ సిరీస్‌ (2-2)

ఇంగ్లాండ్‌ గడ్డపై 2021 ఆగస్టు-సెప్టెంబర్‌లో అతిథ్య జట్టుతో భారత్‌ 5 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడగా.. ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. (ఒక టెస్ట్‌ మ్యాచ్‌ 2022 జులైలో జరిగింది)

Image: Twitter/Bcci

న్యూజిలాండ్‌ సిరీస్ (1-0)

భారత్‌ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌ 2021 నవంబర్‌లో టీమ్‌ఇండియాతో రెండు మ్యాచ్‌లు ఆడింది. అందులో భారత్‌ ఒక మ్యాచ్‌ గెలుపొందగా.. మరో మ్యాచ్‌ డ్రా అయింది. 

Image: Twitter/Bcci

దక్షిణాఫ్రికా సిరీస్‌ (1-2)

ఈ సిరీస్‌లో భారత్‌ నిరాశపర్చింది. 2021 డిసెంబర్‌ - 2022 జనవరి మధ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల్లో భారత్‌ కేవలం ఒక మ్యాచ్‌ మాత్రమే గెలిచింది. దీంతో సిరీస్‌ దక్షిణాఫ్రికా వశమైంది.

Image: Twitter/Bcci

శ్రీలంక (2-0)

గతేడాది మార్చిలో భారత్‌లోనే శ్రీలంక - టీమ్‌ఇండియా రెండు మ్యాచ్‌లు ఆడాయి. రెండింట్లోనూ భారత్‌ ఘన విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకుంది.

Image: Twitter/Bcci

బంగ్లాదేశ్‌ (2-0)

గతేడాది డిసెంబర్‌లో పొరుగుదేశం బంగ్లాదేశ్‌తో భారత్‌ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఆ రెండింట్లోనూ గెలుపొంది.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

Image: Twitter/Bcci

ఆస్ట్రేలియా (2-1)

ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాయి. అందులో రెండు భారత్‌ గెలవగా.. ఆస్ట్రేలియా ఒక విజయాన్ని నమోదు చేసింది. మరో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Image: Twitter/Bcci

మొత్తంగా భారత్‌ 18 మ్యాచ్‌లు ఆడగా.. 10 గెలిచి, 5 ఓడింది. 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఫలితంగా 127(58.8%) పాయింట్లతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా 152(66.67%) పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంది.

Image: Twitter/Bcci

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home