10 వికెట్ల విజయాలు.. భారత్‌ ఖాతాలో ఎన్ని?

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. గురువారం హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

image:Twitter

గతంలోనూ భారత్‌ ఇలా 10 వికెట్ల తేడాతో విజయాలను నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దామా.

image:Eenadu

వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నది మన దేశమే. 1975 జూన్‌ 11న ఈస్ట్‌ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 29.5 ఓవర్లలో ఛేదించింది.

image:Twitter

1984 ఏప్రిల్ 8న శ్రీలంకతో జరిగిన వన్డేలో 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ఓపెనర్లు 21.4 ఓవర్లలోనే ఛేదించారు.

image:Twitter

1997 ఏప్రిల్ 27న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్లతో ఘన విజయం సాధించింది. 113 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 23.1 ఓవర్లలోనే అందుకుంది.

image:Twitter

1998 నవంబర్‌ 13న షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలోనూ టీమ్‌ఇండియా ఒక్క వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. 197 పరుగుల టార్గెట్‌ని 30 ఓవర్లలో ఛేదించింది.

image:Eenadu

2001 అక్టోబర్‌ 12న కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 90 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ వికెట్ కోల్పోకుండా 11.3 ఓవర్లలోనే విజయం సాధించింది.

image:Eenadu

2016 జూన్‌ 15న జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 124 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు 21.5 ఓవర్లలో ఛేదించారు.

image:Eenadu

2022 జులై 12న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మెన్‌ ఇన్‌ బ్లూ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్‌ (76; 58 బంతుల్లో), ధావన్‌ (31; 54 బంతుల్లో) రాణించడంతో 111 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో అందుకుంది.

image:Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home