బ్యాటర్లు బౌలింగ్‌ చేసిన వేళ! 

టాప్‌ బ్యాట్స్‌మెన్‌ చాలా అరుదుగా బౌలింగ్‌ చేస్తుంటారు. ఆసియా కప్‌లో భాగంగా ఇటీవల హాంకాంగ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్‌ చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతడు ఆరేళ్ల తర్వాత బౌలింగ్‌ చేయడం విశేషం.

Image:Twitter

సచిన్‌ తెందూల్కర్‌


క్రికెట్ దిగ్గజం సచిన్‌ మూడు ఫార్మాట్లలో బౌలింగ్‌ చేశాడు. వన్డేల్లో 154, టెస్టుల్లో 46, టీ20ల్లో 1 వికెట్ పడగొట్టాడు.

Image:Eenadu

విరాట్ కోహ్లీ


విరాట్‌ కోహ్లీ కూడా మూడు ఫార్మాట్లలో బౌలింగ్‌ చేశాడు. వన్డేల్లో 4, టీ20ల్లో నాలుగు వికెట్లు తీశాడు.

Image:Twitter

సౌరభ్‌ గంగూలీ


భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ వన్డేల్లో 100, టెస్టుల్లో 32 వికెట్లు పడగొట్టాడు. అతడు ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ కూడా ఆడలేదు.

Image:Twitter

రాహుల్‌ ద్రవిడ్‌


మిస్టర్‌ డిపెండబుల్ రాహుల్‌ ద్రవిడ్ తన స్పిన్‌ బౌలింగ్‌తో వన్డేల్లో నాలుగు వికెట్లు, టెస్టుల్లో ఒక వికెట్ తీశాడు.

Image:Twitter

మహేంద్ర సింగ్ ధోనీ


భారత మాజీ సారథిలోనూ బౌలర్‌ ఉన్నాడు. రెండు వన్డేల్లో బౌలింగ్‌ చేసి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బౌలింగ్‌ చేసినా వికెట్లు సాధించలేదు.

Image:Twitter

రోహిత్‌ శర్మ


భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పిన్‌ బౌలింగ్‌ చేస్తాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 2, వన్డేల్లో 8, టీ20ల్లో 1 వికెట్‌ పడగొట్టాడు.

Image:Twitter

వీరేంద్ర సెహ్వాగ్


భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ మూడు ఫార్మాట్లలో బౌలింగ్‌ చేశాడు. టెస్టుల్లో 40, వన్డేల్లో 96 వికెట్లు తీశాడు. టీ20ల్లో ఒకే ఓవర్‌ బౌలింగ్‌ చేయగా వికెట్‌ దక్కలేదు.

Image:Twitter

గౌతమ్‌ గంభీర్‌ 


టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ టెస్టుల్లో రెండు ఓవర్లు, వన్డేల్లో ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేయగా.. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

Image:Twitter

మహ్మద్‌ అజారుద్దీన్‌


టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ టెస్టుల్లో 13 బంతులు వేసి 16 పరుగులు ఇచ్చాడు. టెస్టుల్లో వికెట్ దక్కకపోయినా వన్డేల్లో 12 వికెట్లు తీశాడు.

Image:Twitter

సునీల్‌ గావస్కర్‌ 


లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్‌ వన్డేల్లో మొత్తం 20 బంతులు బౌలింగ్‌ చేసి ఒక వికెట్ పడగొట్టగా.. టెస్టుల్లో 360 బంతులు విసిరి ఒకరిని పెవిలియన్‌కు చేర్చాడు.

Image:Twitter

వీవీఎస్‌ లక్ష్మణ్‌ 


లక్ష్మణ్ టెస్టుల్లో 324 బంతులు బౌలింగ్‌ చేసి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు వన్డేల్లో బౌలింగ్‌ చేసినా వికెట్ దక్కించుకోలేకపోయాడు.

Image:Twitter

ఛెతేశ్వర్‌ పుజారా


టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఒక్కసారి బౌలింగ్‌ చేశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్‌ బౌలింగ్ చేసి రెండు పరుగులివ్వగా.. వికెట్ల ఖాతాని మాత్రం తెరవలేకపోయాడు.

Image:Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home