భారత్‌కు ఆసియా కప్‌ అందించిన కెప్టెన్‌లు

ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ 2022 ప్రారంభంకానుంది. ఇప్పటివరకు ఈ టోర్నీని 14 సార్లు నిర్వహించగా.. భారత్‌ 7 సార్లు విజేతగా నిలిచింది. మరి ఈ కప్‌లను అందించిన కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం రండి.

Image:Eenadu 

మొదటి ఆసియా కప్‌ పోటీలను 1984లో నిర్వహించారు. ఫైనల్‌లో భారత్.. శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అప్పుడు సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు.

Image:Eenadu 

1988లో నిర్వహించిన ఆసియా మూడో ఎడిషన్‌లో టీమ్‌ఇండియా టోర్నీ విజేతగా నిలిచింది. తుదిపోరులో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. అప్పుడు దిలీప్ వెంగ్‌సర్కార్‌ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

Image:SocialMedia

1990/91లో జరిగిన ఆసియా కప్‌ పోటీల్లో టీమ్‌ఇండియాకు మహ్మద్‌ అజహరుద్దీన్‌ నాయకత్వం వహించాడు. ఫైనల్లో లంకేయులపై భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Image:SocialMedia

1995 ఆసియా కప్‌ పోటీల్లోనూ భారత్‌కు అజహరుద్దీనే కెప్టెన్‌గా ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టైటిల్‌ పోరులో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్‌ అందుకుంది.

Image:SocialMedia

2010లో నిర్వహించిన ఆసియా కప్‌ పోటీల్లో మహేంద్ర సింగ్‌ ధోనీ భారత జట్టును ముందుండి నడిపించాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో భారత్ 81 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది.

Image:SocialMedia

టీ20 ఫార్మాట్లో నిర్వహించిన 2016 ఆసియా కప్‌ పోటీల్లోనూ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ధోనీయే ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఆరోసారి టైటిల్‌ని సొంతం చేసుకుంది.

Image:Eenadu 

2018 ఆసియా కప్‌ పోటీల్లో మెన్‌ ఇన్ బ్లూకు రోహిత్‌ సారథ్యం వహించాడు. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని భారత్‌ 3 వికెట్ల తేడాతో ఓడించింది. 2022 ఆసియా కప్‌ పోటీల్లోనూ రోహితే భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు.

Image:SocialMedia

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home