సూపర్‌ హీరోతో దిల్లీ ఫ్రెష్‌ ఫేస్‌!

‘అశోకవనంలో అర్జున కల్యాణం’తో తొలి ప్రయత్నంలోనే టాలీవుడ్‌లో చలాకీ ఆర్టిస్ట్‌ అని పేరు తెచ్చుకుంది రితికా నాయక్‌. ఇప్పుడు ‘మిరాయ్‌’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. 

కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘మిరాయ్‌’లో తేజ సజ్జ సరసన కనిపించనుంది. ఈ సినిమాలో తేజ సూపర్‌ హీరోగా కనిపించనున్నాడు.

రితిక దిల్లీలో పుట్టింది. నటనపై ఇష్టంతో కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ వైపు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది. 

దిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజ‌న్ 12 , మిస్ దివా 2020 టైటిళ్ల‌ను గెలుచుకుంది. 2021లో టాలీవుడ్‌కి వచ్చింది.

నాని ‘హాయ్‌ నాన్న’లో కీలక పాత్రలో తళుక్కున మెరిసింది. 

ఎన్ని సినిమాలు చేసినా.. తన మొదటి సినిమాలో చేసిన వసుధ పాత్రే తనకు ఎంతో ఇష్టమని చెబుతుంటుంది.

ప్రయాణాలంటే రితికకు ఇష్టం. వివిధ ప్రదేశాలను చుట్టేస్తూ, ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఉంటుంది. 

సింపుల్‌ దుస్తులనే ధరిస్తుంది. ‘నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటాను’ అని తన హ్యాపీనెస్‌ సీక్రెట్‌ బయటపెట్టింది.

సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే వివిధ ప్రకటనలు కూడా చేసింది. ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 4 లక్షల ప్లస్సూ.

సమోసా శిరీషానే.. ‘పుష్ప’రాజ్‌ అన్నకూతురు

ఈ ఏడాది అత్యధికంగా వెతికిన సినిమాలివే!

ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే

Eenadu.net Home