యూట్యూబ్‌లో దూసుకుపోతున్న బుల్లితెర తారలు
ట్రావెలింగ్, ఫుడ్, బేబీ కేర్ వీడియోలు చేస్తూ యూట్యూబర్‌గా మారింది బుల్లితెర యాంకర్ లాస్య. లాస్య టాక్స్ పేరుతో మొదలెట్టిన తన ఛానల్‌కి 1.26 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్లున్నారు.
Image:lasyamanjunath/instagram
తన నటనతో బుల్లితెరపై ఆకట్టుకున్న జాహ్నవి హల్లో.. బిజీ పీపుల్ అంటూ అలరించేందుకు మహాతల్లి పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. దీంతో 1.93 మిలియన్ల సబ్‌స్క్రయిబర్లకు దగ్గరైంది. రోజూ చేసే పనులతోనే హస్యం పండిస్తున్నారీమె! Image:mahathalli/instagram
బుల్లితెర రాములమ్మ గా పేరు సంపాదించుకున్న శ్రీముఖి ఇప్పుడు యూట్యూబ్‌లోకి వచ్చేసింది. ఓ ఉమేనియా అంటూ తారల్ని ఇంటర్య్వూ చేసి, తన ట్రావెల్ వ్లాగ్‌లతో అలరిస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి ఛానల్‌కు 7.49 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లున్నారు
Image:sreemukhi/instagram
నటుడు అలీ సతీమణి జుబేదా అలీ తనదైన తీరులో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వంటలు, టూర్స్ వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్‌లో ఉంచుతున్నారు. జుబేదా అలీ పేరుతో ఉన్న ఆమె ఛానల్‌కి 6.15లక్షల మంది సబ్‌స్క్రయిబర్లున్నారు
Image:zubedaspage/instagram
నటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మధుమిత.. ప్రస్తుతం వంటలు, టూర్స్, పర్సనల్ కేర్, ఉమెన్స్ స్పెషల్ వీడియోలతో యూట్యూబ్‌లోకి వచ్చేశారు. శివమధు ఛానల్‌కి 5.34లక్షల మంది సబ్‌స్క్రయిబర్లున్నారు.
Image:madhumithasivabalaji/instagram
తన లైఫ్ స్టైల్‌ను అభిమానులతో పంచుకునేందుకు యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు లక్ష్మి మంచు. ఈ ఛానల్‌కు 2.7లక్షల మంది సబ్‌స్క్రయిబర్లున్నారు
Image:lakshmimanchu/instagram
ప్రముఖ యాంకర్ సుమ కనకాల కూడా యూట్యూబ్‌లో ‘సుమ’, ‘సుమక్క’ పేరుతో ఛానల్స్ నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. విభిన్న రకాల కంటెంట్ తో వీడియోలు చేస్తున్నారు. ‘సుమ’ ఛానల్‌కి 5.88లక్షలు, ‘సుమక్క’ ఛానల్‌కి 7.06లక్షల సబ్‌స్క్రయిబర్లున్నారు
Image:kanakalasuma/instagram
సీరియల్స్‌తో తన నటన మొదలుపెట్టిన హిమజ బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ఇట్స్ హిమజ పేరుతో యూట్యూబ్ ప్రారంభించిందీ నటీ. ఈ ఛానల్‌కు 5.04లక్షల మంది సబ్‌స్క్రయిబర్లున్నారు.
Image:itshimaja/instagram
న్యూస్ రీడర్‌గా ప్రజలకు సుపరిచితమైన శివజ్యోతి బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు.యూట్యూబ్‌లో జ్యోతక్క పేరుతో ఛానల్‌ని ప్రారంభించి డైలీ రొటీన్, వ్లాగ్‌లు,వంటలు, వివిధ ప్రాంతాల గురించి వ్లాగ్‌లు చేస్తున్నారు. 6.46లక్షల మంది సబ్‌స్క్రయిబర్లున్నారు.
Image:instagram
సీరియల్ నటిగా తన కెరియర్ ప్రారంభించిన రోహిణి తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. రౌడి రోహిణి పేరుతో యూట్యూబ్ ప్రారంభించి 4.16 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లకు దగ్గరైంది. Image:actressrohini/instagram
సీరియల్ నటిగా పేరొందిన సుష్మా తన వ్లాగ్‌లతో సుష్మా కిరణ్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఈ ఛానల్‌కు 7.06 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు.
Image:sushmakiron/instagram