టెన్నిస్‌ స్టార్‌.. క్రికెట్‌ జట్టుకు మెంటార్‌

భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా.. ఇప్పుడు క్రికెట్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించనుంది.

Image: Instagram/sania mirza

త్వరలో ‘మహిళల ప్రీమియర్‌ లీగ్‌’ జరగనున్న నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు మెంటార్‌గా ఉండనుంది. 

Image: Instagram/sania mirza

టెన్నిస్‌ క్రీడలో దేశానికి ఎన్నో విజయాలు తెచ్చిపెట్టిన సానియా.. ముంబయిలో 1986 నవంబర్‌ 15న జన్మించింది. ఆరేళ్ల ప్రాయంలోనే రాకెట్‌ పట్టింది.

Image: Instagram/sania mirza

సానియకు మెరుగైన శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు హైదరాబాద్‌కు నివాసం మార్చారు. నగరంలోని సెయింట్‌ మేరీ కళాశాలలో సానియా డిగ్రీ చదువుకుంది.

Image: Instagram/sania mirza

టెన్నిస్‌ శిక్షణలో సానియా తొలి కోచ్‌ ఎవరో తెలుసా? టెన్నిస్‌ ప్లేయర్‌ మహేశ్‌ భూపతి తండ్రి.. కృష్ణ భూపతి. మహేశ్‌, సానియా కలిసి ఎన్నో టోర్నమెంట్స్‌ ఆడారు. 2012లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్‌ టైటిల్‌ గెలిచారు.

Image: Instagram/sania mirza

విమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌(డబ్ల్యూటీఏ) టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణి సానియా. ప్రైజ్‌ మనీ ద్వారా 1 మిలియన్‌ డాలర్లు సంపాదించిన తొలి క్రీడాకారిణి కూడా సానియానే.

Image: Instagram/sania mirza

సానియా 2010లో పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకుంది. అయినా.. టెన్నిస్‌ టోర్నమెంట్లలో భారత్‌ తరఫునే ఆడుతూ వస్తోంది. 

Image: Instagram/sania mirza

సానియా-మాలిక్‌ జంట పాకిస్థాన్‌లో ఉండట్లేదు... భారత్‌లోనూ నివసించట్లేదు. ఇద్దరూ కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఇజహాన్‌ మీర్జా మాలిక్‌ ఉన్నాడు. ఇటీవల ఈ జంట విడిపోతుందని వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని తేలింది.

Image: Instagram/sania mirza

తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా సానియాను సీఎం కేసీఆర్‌ 2014లో నియమించారు. ఇక ఐక్యరాజ్యసమితి విమెన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమితులైన తొలి దక్షిణ ఆసియా మహిళ సానియానే.

Image: Instagram/sania mirza

కేంద్ర ప్రభుత్వం సానియాను అర్జున, ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డులతో సత్కరించింది.

Image: Instagram/sania mirza

హైదరాబాద్‌లోనే సానియా టెన్నిస్‌ అకాడామీని నెలకొల్పింది. 

Image: Instagram/sania mirza

ఈ టెన్నిస్‌ ప్లేయర్‌ అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. తన ఆటతో, గ్లామర్‌తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. 

Image: Instagram/sania mirza

అప్పుడప్పుడు ఫ్యాషన్‌ షోల్లో ర్యాంప్‌ వాక్‌ చేస్తూ, సినీ వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తుంటుంది. పలు బ్రాండ్‌ ఉత్పత్తులకు ప్రచారకర్తగానూ వ్యవహరిస్తోంది. 

Image: Instagram/sania mirza

టెన్నిస్‌ కాకుండా సానియాకు క్రికెట్‌, స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం. రోజర్‌ ఫెదరర్‌ తనకు స్ఫూర్తి అని పలుసందర్భాల్లో తెలిపింది. 

Image: Instagram/sania mirza

సినిమాల విషయానికొస్తే.. షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, మాధూరి దీక్షిత్‌ అంటే అభిమానం.

Image: Instagram/sania mirza

గత నెలలోనే తన రిటైర్మెంట్‌ గురించి ఓ ప్రకటన చేసింది. త్వరలో జరగబోయే దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ సానియా ఆఖరి టోర్నమెంట్‌.

Image: Instagram/sania mirza

This browser does not support the video element.

ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో సానియా చేస్తోన్న కసరత్తులు ఇవీ..!

video: Instagram/sania mirza


రోహిత్‌ @ 250.. 200 క్లబ్‌లో ఇంకెవరు?

ఐపీఎల్‌లో జట్ల అత్యల్ప స్కోర్స్‌ ఇవీ!

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలివీ!

Eenadu.net Home