పెళ్లిపీటలెక్కిన ట్రాన్స్‌జెండర్‌ హీరోయిన్‌

అన్ని రంగాల్లోనూ ట్రాన్స్‌జెండర్‌ మహిళలు రాణిస్తున్నారు. అలాగే, సినిమాల్లోనూ ట్రిచాడ పెట్చరాట్‌ అనే ట్రాన్స్‌జెండర్ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ సంపాదించింది. 

Image: Instagram/poydtreechada

పోయిడ్‌ ట్రిచాడగా పాపులరైన ఈ థాయ్‌లాండ్‌ సినీ తార.. ఫుకెట్‌ ప్రావిన్స్‌కు చెందిన బడా వ్యాపారవేత్త ఓక్‌ భవఘా హాంగ్యోక్‌ను వివాహం చేసుకొని తాజాగా వార్తల్లో నిలిచింది.

Image: Instagram/poydtreechada

ఇప్పుడు మేమిద్దరం అధికారికంగా భార్యాభర్తలం అంటూ పోయిడ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు పెట్టింది. 

Image: Instagram/poydtreechada

పోయిడ్‌.. థాయ్‌లాండ్‌లోని ఫెంగ్‌నాలో 1986 అక్టోబర్‌ 5న మగ బిడ్డగా జన్మించాడు. కాస్త పెద్దయ్యాక తనలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గుర్తించాడు.

Image: Instagram/poydtreechada

కొన్నాళ్లు పురుషుడిగా జీవించినప్పటికీ.. పదిహేడేళ్ల వయసులో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడంతో అమ్మాయిగా కొత్త జీవితం ప్రారంభమైంది. 

Image: Instagram/poydtreechada

పోయిడ్‌.. 2004లో ట్రాన్స్‌జెండర్స్‌ కోసం నిర్వహించే మిస్‌ టిఫ్పనీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అదే ఏడాది మిస్‌ ఇంటర్నేషనల్‌ క్వీన్‌ టైటిల్‌ గెలుచుకుంది. 

Image: Instagram/poydtreechada

మోడలింగ్‌ చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ట్రాన్స్‌జెండర్‌ బ్యూటీ.. 2010లో ‘విత్‌ లవ్‌’తో తెరంగేట్రం చేసింది.

ఆ తర్వాత ‘స్పైసీ బ్యూటీ క్వీన్‌ ఆఫ్‌ బ్యాంకాక్‌ 2’లో నటించింది. 

Image: Instagram/poydtreechada

పోయిడ్‌ నటన మెచ్చి హాంకాంగ్‌ నుంచి అవకాశాలొచ్చాయి. అలా ‘ది వైట్‌ స్టామ్‌’, ‘ఫ్రమ్‌ వెగాస్‌ టు మకావ్‌ 2’, ‘ఇన్సోమియా లవర్‌’, ‘విచ్‌ డాక్టర్‌’ చిత్రాల్లో నటించింది. మొత్తం ఆరేళ్లలో పోయిడ్‌ నటించింది కేవలం ఆరు సినిమాలే. 

Image: Instagram/poydtreechada

సినిమాల కంటే.. మోడలింగ్‌ పైనే పోయిడ్‌ దృష్టి పెట్టింది. ప్రస్తుతం పోయిడ్‌ వయసు 36. అయినా తరగని అందంతో సూపర్‌ మోడల్‌గా గుర్తింపు పొందింది. పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. 

Image: Instagram/poydtreechada

ఫిబ్రవరిలో పోయిడ్‌కు ఓక్‌ భవఘాతో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు వీరిద్దరు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

Image: Instagram/poydtreechada

సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే పోయిడ్‌.. తన వ్యక్తిగత విషయాలు, ఆసక్తులను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటుంది. ఇన్‌స్టాలో పోయిడ్‌కు 2.6 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Image: Instagram/poydtreechada

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home