సినిమాల ప్రచారం.. తమన్నా వయ్యారం!

తన కొత్త సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ప్రమోషన్లలో భాగంగా దిగిన ఫొటోలు, సరదా స్టిల్స్‌ తమన్నా సోషల్‌ మీడియాలో పంచుకోగా అవి అందరి దృష్టిని ఆకర్షించాయి. ట్రెండీ దుస్తుల్లో తమన్నా ఎప్పుడు? ఎలా కనిపించిందో ఓ లుక్కేయండి..

‘ఆఖ్రీ సచ్‌’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్‌ కోసం దిగిన ఫొటో ఇది. ఈ సిరీస్‌ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

‘జైలర్‌’ ఆడియో లాంచ్‌లో తమన్నా ఇలా మెరిసింది. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

‘జైలర్‌’ విడుదలకు ముందు ముంబయిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఇలా కనిపించింది. ఈ చిత్రం ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో అందుబాటులో ఉంది.

‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ ఆంథాలజీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతుందని తెలియజేస్తూ ఈ డ్రెస్సులో హొయలొలికించింది.

సహ నటుడు, బాయ్‌ఫ్రెండ్‌ విజయ్‌ వర్మతో కలిసి ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ ప్రమోట్‌ చేసింది.

‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘జీ కర్దా’ వెబ్‌సిరీస్‌ ప్రమోషన్‌ కోసం వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్సులో..

ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో బ్లూ డ్రెస్సులో తళుక్కుమంది.

ఇంతకుముందు పేర్కొన్న సినిమాలు, సిరీస్‌లతోపాటు.. చిరంజీవి ‘భోళా శంకర్‌’లోనూ తమన్నా నటించింది. ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

‘బంద్రా’ (మలయాళం), ‘అరణ్‌మణై’ (తమిళం), ‘వేదా’ (హిందీ) చిత్రాలతో తమన్నా బిజీగా ఉంది.

‘పెళ్లి ఎప్పుడు?’ అన్న ప్రశ్న తమన్నాకు ఇటీవల ఎక్కువగా ఎదురవుతోంది. ‘‘నా తల్లిదండ్రులే ఇలా నన్నెప్పుడూ అడగలేదు’’ అని ఆమె ఓ సందర్భంలో సమాధానమిచ్చింది.

తాను పెట్టుకున్న ‘నో కిస్సింగ్‌’ రూల్‌ని 18 ఏళ్ల తర్వాత ‘లస్ట్‌ స్టోరీస్‌’ కోసం బ్రేక్‌ చేసింది.

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

మేనమామే అయినా 17 సార్లు ఆడిషన్‌ ఇచ్చింది!

యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

Eenadu.net Home