తండేల్.. డంకీ.. ఈ టైటిళ్లకు అర్థం తెలుసా?
#eeadu
మత్స్యకారుల బృంద నాయకుడు. వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు.
తారాగణం: నాగచైతన్య, సాయిపల్లవి;
దర్శకుడు: చందూ మొండేటి
డంకీ..
అక్రమంగా దేశ సరిహద్దులగుండా ప్రయాణించడం.
తారాగణం: షారుక్‌ఖాన్, తాప్సీ; దర్శకుడు: రాజ్‌కుమార్ హిరాణీ;
విడుదల: 21 డిసెంబరు 2023.
తంగలాన్..
తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీయఫ్)లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. తారాగణం: విక్రమ్, మాళవిక మోహనన్;
దర్శకుడు: పా. రంజిత్;
విడుదల: 26 జనవరి 2024
కంగువ..
అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది.
తారాగణం: సూర్య, దిశా పటానీ;
దర్శకుడు: శివ; విడుదల: 2024 వేసవి.
మట్కా..
ఇదో రకమైన జూదం. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
తారాగణం: వరుణ్‌తేజ్, మీనాక్షి చౌదరి;
దర్శకుడు: కరుణకుమార్;
సలార్..
నాయకుడు.. రక్షకుడు.. ఇలా పలు అర్థాలున్నాయి.
తారాగణం: ప్రభాస్, శ్రుతిహాసన్;
దర్శకుడు: ప్రశాంత్ నీల్; విడుదల: 22 డిసెంబరు 2023
జిగర్‌తండ డబుల్ ఎక్స్..
మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్.
తారాగణం: లారెన్స్, ఎస్.జె. సూర్య;
దర్శకుడు: కార్తిక్ సుబ్బరాజు;
‘అయలాన్’ (పొరుగువాడు)
తారాగణం: శివకార్తికేయన్; రకుల్‌ప్రీత్;
దర్శకుడు: రవికుమార్;
విడుదల: 2024 సంక్రాంతి