U19 WC:
వీరు స్టార్లు..
వారు కనుమరుగు!
అండర్ 19 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులోకి వచ్చి స్టార్లు అయిన వారు.. వీళ్లు..
వీరేంద్ర సెహ్వాగ్
అండర్ 19 వరల్డ్ కప్ 1998లో ఆడాడు. బౌలింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. జాతీయ జట్టు తరఫునా రికార్డులు సృష్టించాడు.
హర్భజన్ సింగ్
భజ్జీ కూడా 1998 ఎడిషన్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహంచాడు. కొద్ది కాలానికే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
యువరాజ్ సింగ్
భారత్ గెలిచిన వన్డే, టీ20 వరల్డ్ కప్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన యువరాజ్ 2000 అండర్ 19 ప్రపంచకప్‌లో ఆడాడు.
శిఖర్ ధావన్
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ధావన్ అండర్ 19 వరల్డ్‌కప్ 2004 ఎడిషన్‌లో ఆడాడు. ఏడు మ్యాచుల్లో 505 పరుగులు చేశాడు.
సురేశ్ రైనా..
మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సురేశ్ రైనా కూడా 2004 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఆడాడు.
ఛెతేశ్వర్ పుజారా
అండర్-19 వరల్డ్ కప్ 2006లో ఆడిన పుజారా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 349 పరుగులు చేశాడు. రోహిత్ కంటే ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం.
రోహిత్ శర్మ
ప్రస్తుత టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ 2006 అండర్19 వరల్డ్ కప్‌లో ఆడాడు. భారత్ ఫైనల్‌కు చేరుకోవడంలో (ఆరు ఇన్నింగ్స్‌ల్లో 205 పరుగులు) కీలక పాత్ర పోషించాడు.
విరాట్ కోహ్లీ
కింగ్ కోహ్లీగా ఎదిగిన విరాట్ 2008 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక పరుగులు (235 పరుగులు) చేసిన బ్యాటర్. అతడి కెప్టెన్సీలోనే విజేతగా నిలిచింది.
రవీంద్ర జడేజా
రెండు అండర్-19 వరల్డ్ కప్‌ల్లో ఆడిన ఆటగాడు. 2006, 2008 ఎడిషన్లలో ప్రాతినిధ్యం వహించాడు.
రిషభ్ పంత్
బంగ్లా వేదికగా జరిగిన 2016 అండర్ 19 వరల్డ్ కప్‌లో పంత్ ఆడాడు. 267 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అండర్ 19లో అదరగొట్టినా.. జాతీయ జట్టులో చోటు సంపాదించినా.. స్టార్లుగా ఎదగలేకపోయిన ఆటగాళ్లు వీళ్లు...
ఉన్ముక్త్ చంద్
2021 అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు కెప్టెన్. కానీ, జాతీయ జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. టీమ్‌ఇండియాను వదిలి వేరే దేశానికి వెళ్లిపోవడం గమనార్హం.
సందీప్ శర్మ
ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న సందీప్ శర్మ 2012 అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆడాడు. ఆరు మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. జింబాబ్వేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టినప్పటికీ స్థానాన్ని నిలబెట్టుకోలేదు.
సిద్ధార్థ్ కౌల్
విరాట్ కోహ్లీకి 2008 అండర్19 వరల్డ్ కప్‌లో సహచరుడు. ఐదు మ్యాచుల్లోనే 10 వికెట్లు తీశాడు. జాతీయ జట్టుకు ఎంపికైనా.. ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు.