ఈ తారలకున్న ఫోబియాల గురించి తెలుసా?
తమన్నా - అక్రో ఫోబియా
మిల్కీ బ్యూటీకి ఎత్తయిన ప్రదేశాలంటే చాలా భయం.
Image: Instagram
దీపికా పదుకొణె - ఓపిడియోఫోబియా
పాములంటే అందరికీ భయమే. కానీ, ఈ బీ టౌన్ స్టార్‌కి పాము అన్న మాట వింటేనే వణుకు వచ్చేస్తుందట.
Image: Instagram
కాజల్ - ఆర్నితోఫోబియా
పక్షులను చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. కానీ, టాలీవుడ్ చందమామకి పక్షులంటే భయం.
Image: Instagram
ఐశ్వర్య రాజేశ్ - ఫాస్మోఫోబియా
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌కి దెయ్యాలంటే చాలా భయం. ఆ భయాన్ని పోగొట్టుకునేందుకు ఈ మధ్య ఓ దెయ్యం సినిమాలోనూ నటించింది.
Image: Instagram
కత్రినా కైఫ్ - హెర్పటోఫోబియా, లైకోపెర్సిసోఫోబియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ బల్లులు, టమాటోలను చూస్తే భయపడుతుందట. బల్లులంటే చాలా మందికి భయమే కానీ, టమాటోలను చూసి భయపడమే విడ్డూరం.
Image: Instagram
సోనమ్ కపూర్ - క్లిత్రో ఫోబియా
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌ని ఎక్కడైనా చిక్కుకుపోతామనే ఊహ చాలా భయపెడుతుందట. లిఫ్ట్, మంచు ప్రాంతాలను చూస్తే చెమటలు పట్టేస్తాయట.
Image: Instagram
హన్సిక - బ్యాక్టీరియోఫోబియా
హన్సికకి బ్యాక్టీరియాలంటే భయం. అందుకే, ఎక్కడ బ్యాక్టీరియా తనలోకి ప్రవేశిస్తుందోనని సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్‌ను ఉండకుండా చూసుకుంటుందట.. ఈ దేశముదురు హీరోయిన్.
Image: Instagram
అలియా భట్ - నిక్టోఫోబియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌కు చీకటి అంటే భయం. చిన్నతనంలో తన సోదరి ఓ చీకటి గదిలో బంధించడంతో ఈ భయం ఆమెను వెంటాడుతోందని ఓ మీడియా కథనంలో వెల్లడైంది.
Image: Instagram
ప్రియాంక చోప్రా - ఎక్వినోఫోబియా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకి గుర్రపుస్వారీ చేయడమంటే భయం. అందుకే, గుర్రాలు ఉండే సన్నివేశాల్లో నటించడానికి విముఖత చూపుతుందట.
Image: Instagram
త్రిష
దక్షిణాదిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిషకి దెయ్యం సినిమాలు చూడటమంటే భయం. కానీ, ఆ భయాన్ని అధిగమించడానికి త్రిష హారర్ సినిమాల్లో నటించింది.
Image: Instagram
తాప్సీ
తాప్సీకి కూడా దెయ్యం సినిమాలు చూడాలంటే చచ్చేంత భయమట. అయినా, ఆ భయాన్ని జయించడం కోసం త్రిషలాగే పలు హారర్ జానర్ సినిమాల్లో నటించింది.
Image: Instagram