ఈపీఎఫ్‌ చందాదారులకు లభించే ప్రయోజనాలు తెలుసా?

ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్‌ ఖాతా సుపరిచితమే. ఉద్యోగి, యాజమాని నుంచి 12 శాతం చొప్పున ఈ ఖాతాలో జమ అవుతుంది.

ఈ మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించినదే అయినా.. అత్యవసర పరిస్థితుల్లో ఉపసంహరించుకోవడానికీ వీలుంది. దీంతోపాటు అనేక ప్రయోజనాలు ఈపీఎఫ్‌ ద్వారా లభిస్తాయి.

పన్ను మినహాయింపు..

పీఎఫ్‌ ఖాతాలో జమ చేసే నగదుపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. పాత పన్ను విధానంలోని వారికి మాత్రమే.

వడ్డీపై పన్ను ఉండదు..

ప్రతి నెలా పీఎఫ్‌ ఖాతాలో జమయ్యే మొత్తంపై వడ్డీ లభిస్తుంది. దీనిపై ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదు.

మెచ్యూరిటీపైనా..

జీతం శ్లాబ్‌తో సంబంధం లేకుండా మెచ్యూరిటీ మొత్తంపైనా ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించక్కర్లేదు.  

పెన్షన్‌

ఈపీఎఫ్‌ చందాదారులకు రిటర్మెంట్‌ అనంతరం పెన్షన్‌ లభిస్తుంది. చందాదారుడు మరణిస్తే.. ఆ కుటుంబ సభ్యులకు పెన్షన్‌ అందుతుంది.

ముందస్తు ఉపసంహరణ

ఈపీఎఫ్‌ నిల్వలను గృహ నిర్మాణం, వైద్య చికిత్స, ఉన్నత విద్య వంటి పరిస్థితుల్లో ముందస్తు ఉపసంహరణ చేసుకోవచ్చు.

బీమా

ఈపీఎఫ్‌ అందిస్తున్న అనేక ప్రయోజనాల్లో ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (EDLI) కూడా ఒకటి. సర్వీసులో ఉండగా చందాదారుడికి జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి రూ.7 లక్షల వరకు బీమా ప్రయోజనాన్ని ఈపీఎఫ్‌ఓ అందిస్తుంది.

చక్ర వడ్డీ..

ఈపీఎఫ్‌ ఖాతాలోని నగదు నిల్వలపై ఏడాదికోసారి 8.25 శాతం (2023--24 ఆర్థిక సంవత్సరానికి) చక్రవడ్డీ లభిస్తుంది. ఈపీఎఫ్‌లో ఎక్కువ కాలం ఉండే వారికి పదవీ విరమణ నాటికి కార్పస్‌ వేగంగా పెరగుతుంది.

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home