#eenadu

భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ముద్దు అనేది ఓ సాధారణ విషయమే.. ఇక తల్లిదండ్రులు, ఆత్మీయులు, స్నేహితులు ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ముద్దాడతారు.. అసలు ముద్దు వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా..?

ఒత్తిడిని తగ్గించేందుకు ముద్దు ఓ మంచి మార్గం. కిస్‌ చేయడం వల్ల సెరొటోనిన్‌, డొపమైన్‌ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తాయి.

ముద్దు పెట్టుకోవడం వల్ల పని ఒత్తిడి, అలసట తగ్గడంతో పాటు భావోద్వేగాలు కూడా అదుపులోకి వస్తాయి. ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పీ తగ్గుతుంది.  

భాగస్వామిని నేరుగా పెదవులపై కిస్‌ చేయడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఆప్యాయత పెరగడంతో పాటు ఒకరికోసం ఒకరున్నారనే ధైర్యం వస్తుంది.

 ముద్దు పెట్టుకోవడం వల్ల గుండె పనితీరు మెరగవుతుంది. రక్తసరఫరా సజావుగా జరిగి.. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులూ దరిచేరవు.

వెస్ర్టన్‌ జర్నల్‌లో వచ్చిన ఓ అధ్యయనం ప్రకారం తరచూ ముద్దు పెట్టుకోవడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయులు అదుపులో ఉంటాయట. తద్వారా బరువూ తగ్గొచ్చు. 

లిప్‌ కిస్‌తో లాలాజల మార్పిడి జరుగుతుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, శుభ్రత పాటించడం తప్పనిసరి.

ముద్దు వల్ల కేలొరీలు అధికంగా ఖర్చవుతాయి. ఎంత ఎక్కువ సమయం కిస్‌ చేస్తే అంత అలసిపోతారు. అంతే కాకుండా శృంగారాన్నీ చక్కగా ఆస్వాదించగలరు.

లిప్‌ కిస్‌ చేయడం వల్ల ముఖంలో ఉండే 24 కండరాలకు వ్యాయామం అవుతుంది. దీంతో ముఖ కండరాలు ఫిట్‌గా అవడమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలున్నా.. జలుబు, జ్వరం, నోట్లో ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు భాగస్వామిని ముద్దు పెట్టుకోకూడదు. దాని వల్ల వారికి కూడా ఆ జబ్బులు అంటుకునే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home