టైటన్‌ ఎస్‌బీఐ కార్డ్‌.. ప్రయోజనాలివే.. 

ఎస్‌బీఐ కార్డు, టైటన్‌ కంపెనీ లిమిటెడ్‌ కలిసి ఓ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చాయి. దీనితో వివిధ కేటగిరీల్లో ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

క్యాష్‌బ్యాక్‌లు, టైటన్‌ గిఫ్ట్‌ వోచర్లు, రివార్డు పాయింట్లు.. ఏటా దాదాపు రూ.2,00,000 వరకు ప్రయోజనం.

మియా, క్యారట్‌లేన్‌, జోయా కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌. (ఒక త్రైమాసికంలో గరిష్ఠంగా రూ.10,000 మాత్రమే)

తనిష్క్‌లో చేసే వ్యయంపై 3% విలువ చేసే గిఫ్ట్‌ వోచర్లు (ఒక త్రైమాసికంలో గరిష్ఠంగా రూ.25 వేల వరకు)

జాయినింగ్‌, రెన్యువల్‌ ఫీజు రూ.2,999. పన్నులు అదనం.

జాయినింగ్‌ ఫీజు చెల్లించిన వెంటనే వెల్‌కమ్‌ గిఫ్ట్‌ కింద 12,000 రివార్డు పాయింట్లు.

ఒక సంవత్సరంలో కార్డుపై చేసే వ్యయం రూ.3 లక్షలు దాటితే రెన్యువల్‌ ఫీజు రద్దు.

టైటన్‌ బ్రాండ్‌ కొనుగోళ్ల విలువ రూ.5 లక్షలు దాటితే రూ.5,000; రూ.10 లక్షలు దాటితే రూ.10 వేల గిఫ్ట్‌ వోచర్‌.

ఏడాదిలో 8 డొమెస్టిక్‌, 4 ఇంటర్నేషనల్‌ లాంజ్‌ యాక్సెస్‌లు. ఒక త్రైమాసికంలో గరిష్ఠంగా 2 మాత్రమే.

రూ.500 నుంచి రూ.3,000 వరకు చేసే ఇంధన కొనుగోళ్లపై 1% ఫ్యుయెల్‌ సర్‌ఛార్జి రద్దు.

టైటన్‌, తనీరా, టైటన్‌ ఐప్లస్‌ సహా ఇతర నాన్‌-జువెలరీ టైటన్‌ బ్రాండ్లపై 7.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌. (ఒక త్రైమాసికంలో గరిష్ఠంగా రూ.10,000 మాత్రమే)

పాన్‌ లేకున్నా సిబిల్‌ స్కోర్‌.. ఎలా..?

ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌

ఇండియాకు +91 కోడ్‌ ఎలా వచ్చింది?

Eenadu.net Home