#eenadu
వాట్సప్ వాయిస్ మెసేజ్‌ని వినేందుకు వీలుకాని సందర్భంలో ఆ సందేశాన్ని టెక్ట్స్ రూపంలో చదువుకునేందుకు వీలుగా వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ ఫీచర్‌ను వాట్సప్ తీసుకొచ్చింది. ఇందుకోసం చాట్ సెట్టింగ్స్‌లో Voice message Transcripts ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి.
వాట్సప్‌లోనూ నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేయొచ్చు. స్టేటస్ అప్‌లోడ్ చేసే సమయంలో @ ఐకాన్ ఎంచుకొని నచ్చిన వ్యక్తులను మెన్షన్ చేయొచ్చు. ఆ వ్యక్తికి నోటిఫికేషన్ అందుతుంది.
‘కస్టమ్ లిస్ట్’ ఫీచర్‌ను వాట్సప్ తీసుకొచ్చింది. యాప్ ఓపెన్ చేయగానే పైన అనేక ఫిల్టర్లు కనిపిస్తాయి. దాని పక్కనే ఉన్న ‘+’ సాయంతో యూజర్లకు నచ్చినట్టుగా చాట్స్‌ను ఫిల్టర్లు క్రియేట్ చేయొచ్చు.
వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చేందుకు సరికొత్త ఫిల్టర్లు తీసుకొచ్చింది. 10 రకాల బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్స్, 10 రకాల ఫిల్టర్లు ఉన్నాయి.
వాట్సప్‌లో మెటా ఏఐ ఈ ఏడాదే ఇంటిగ్రేట్ అయ్యింది. దీని సాయంతో ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం పొందొచ్చు. రియల్‌టైమ్ ఇమేజ్‌లను క్రియేట్ చేయొచ్చు. మీ ఊహకు తగ్గట్లుగా ప్రాంప్ట్ ఇస్తే ఇట్టే ఇమేజ్‌ను జనరేట్ చేసి ఇస్తుంది.
ప్రైవసీని మరింత మెరుగుపరిచేందుకు వాట్సప్ ఇప్పటికే అనేక ఫీచర్లు తీసుకొచ్చింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్ షాట్ తీసే సదుపాయాన్ని తొలగించింది.
లాక్ చాట్ ఫీచర్‌ను వాట్సప్ మరింత సులభతరం చేసింది. ప్రత్యేకంగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా లాక్ చేయాలనుకున్న చాట్‌పై లాంగ్ ప్రెస్ చేసి ‘లాక్ చాట్’ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.
సీక్రెట్ కోడ్ ద్వారా లాక్ చేసిన చాట్స్‌ను అదృశ్యం చేసే సదుపాయాన్ని వాట్సప్ ఈ ఏడాది పరిచయం చేసింది. లాక్ అయిన చాట్ ఫోల్డర్‌లో సెట్టింగ్స్‌కు వెళ్లి కోడ్‌ను సెటప్ చేసుకోవాలి. ఆపై సెర్చ్‌లో కోడ్ ఎంటర్ చేస్తేనే లాక్డ్ చాట్స్ కనిపిస్తాయి.
వీటితో పాటు నచ్చినట్లుగా చాట్ థీమ్, యూజర్ నేమ్‌తోనే మెసేజ్, స్టేటస్‌లో నిమిషం వీడియో, లింక్డ్ డివైజెస్‌లోనూ కాంటాక్ట్ సేవ్, రివర్స్ ఇమేజ్ సెర్చ్ వంటి మరిన్ని ఫీచర్లు త్వరలో వాట్సప్ తీసుకురానుంది.