#eenadu

ఆపిల్‌.. మనకు విరివిగా దొరికే పండ్ల జాతుల్లో ఒకటి. భారత్‌ సహా వివిధ దేశాల్లో ఉద్యానవన పంటగా సాగు చేస్తారు. అనేక దేశాలకు జాతీయ పండుగానూ ప్రసిద్ధికెక్కింది. ఆ దేశాల వివరాలు ఇవీ..

అర్జెంటీనా

ఇక్కడ ఆపిల్స్‌ను పెద్ద ఎత్తున సాగు చేస్తారు. రాయల్ గాలా, బ్రేబర్న్‌, క్రిప్స్‌ పింక్‌ వంటి రకాలు పండుతాయి.

ఆస్ట్రియా

ఈ దేశ జాతీయ పండు మాత్రమే కాదు.. ఇక్కడి ప్రజలు కూడా ఆపిల్‌ను ఇష్టంగా తింటారట. ఒక్కో వ్యక్తి సగటున ఏడాదికి 155 ఆపిల్‌ ఆరగిస్తారట.

యూకే

యూకే మొత్తం మీద దాదాపు రెండు వేల రకాల ఆపిల్స్‌ని పండిస్తారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వీటిని వంటల్లో ఉపయోగిస్తారు. ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని తయారు చేస్తారు.

జర్మనీ

ఈ దేశంలో గోల్డెన్‌ డెలిషియస్‌, బెల్లె దె బాస్కూప్‌, గ్రాన్నీ స్మిత్ వంటి ఆపిల్‌ రకాలు ఫేమస్‌. ఇక్కడి ప్రజల్లో 38 శాతం మంది మల్టీకలర్డ్‌, 36 శాతం రెడ్‌, 21 శాతం గ్రీన్‌ ఆపిల్స్‌ని వినియోగిస్తారట.

రష్యా

ఇక్కడి ప్రజల్లో 50 శాతం మంది ఆపిల్‌ పంటనే సాగు చేస్తున్నారు. చాలా ఎక్కువ మందికి జీవనోపాధి కలిగిస్తున్న పంట ఇది.

స్విట్జర్లాండ్‌

ఇక్కడ ఎక్కువగా దొరికేది గోల్డెన్‌ డెలిషియస్‌ రకం. ఈ దేశంలో పెద్ద మొత్తంలో ఆపిల్స్‌ని పండించడమే కాదు.. చాలా మంది ఇళ్లలో పెరటి మొక్క.

పోలెండ్‌

పోలెండ్‌లో దాదాపు 14 రకాల ఆపిల్స్‌ని పండిస్తారు. రాయల్‌ గాలా, గోల్డెన్‌ డెలిషియస్‌, జోనా ప్రిన్స్‌, ష్జాంపియన్‌ ప్రముఖంగా దొరుకుతాయి.

పోర్చుగల్

ఇక్కడ ఏటా 15 వేల టన్నుల వరకు ఆపిల్‌ సాగవుతుంది. గాలా, గోల్డెన్‌ డెలిషియస్‌, రెడ్‌ డెలిషియస్‌ వంటి రకాలు పండిస్తారు.

ఆపిల్‌ ప్రత్యేకత ఇదీ..

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చనేది నానుడి. దీంట్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి కలిగి ఉంటుంది. తేలికగా జీర్ణం అవడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

మెదడుకు పదును పెట్టేద్దామిలా

గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్‌-10 ఫుడ్‌

పెళ్లి బంధం దృఢంగా మారాలంటే ఇవి పాటించాల్సిందే!

Eenadu.net Home