మార్చిలో ఈ మార్పులు రాబోతున్నాయ్‌!

మార్చిలో ఆర్థికంగా పలు మార్పులు రాబోతున్నాయి. మార్చి 1 నుంచి కొన్ని ఫాస్టాగ్‌లు డీయాక్టివేట్‌ అవ్వనున్నాయి. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు కూడా ఈ నెలలోనే ముగియనుంది. ఆ వివరాలు ఇవీ

ఫాస్టాగ్‌

కేవైసీ చేయని ఫాస్టాగ్‌లు మార్చి 1 నుంచి డీయాక్టివేట్ అవ్వనున్నాయి. ‘వన్‌ వెహికల్‌ వన్‌ ఫాస్టాగ్‌’లో భాగంగా NHAI ఈ నిబంధన తీసుకొచ్చింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ఖాతాలో గానీ, వ్యాలెట్‌లో గానీ డబ్బులు వేయలేరు. విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు మాత్రం ఉంది.

బ్యాంక్‌ సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు మార్చి నెలలో శని (2,4), ఆదివారాలు కాకుండా 3 రోజులు అదనంగా సెలవులు రానున్నాయి.

మార్చి 8న శివరాత్రి, 25న హోలీ, 29న గుడ్‌ఫ్రైడే కారణంగా ఆయా తేదీల్లో బ్యాంకులు పనిచేయవు.

స్టాక్‌ మార్కెట్లు

బ్యాంకులు తరహాలోనే స్టాక్‌ మార్కెట్లూ మార్చి 8, 25, 29 తేదీల్లో పనిచేయవు.

మార్చి 2న శనివారం అయినప్పటికీ స్టాక్‌ మార్కెట్లు పనిచేస్తాయి. డిజాస్టర్‌ రికవరీ సైట్‌ ట్రయల్స్‌లో భాగంగా ట్రేడింగ్‌ నిర్వహించనున్నారు.

GST

రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్‌ కలిగిన వ్యాపారులకు మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బిజినెస్‌-టు- బిజినెస్‌ లావాదేవీలకు ఇ- ఇన్‌వాయిస్‌ లేకుండా ఇ-వే బిల్లులు జనరేట్‌ చేయడం కుదరదు.

ఇదే ఆఖరు ఛాన్స్‌

2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి మినహాయింపులు పొందాలనుకుంటే పెట్టుబడులకు మరికొన్ని రోజులే గడువు ఉంది.

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home