ఇ-లూనా ఫీచర్లు ఇవే..!
ఒకప్పుడు దేశీయ రోడ్లపై పరుగులు పెట్టిన కైనటిక్ లూనా.. ఇ-లూనా పేరిట కొత్త అవతారంలో మార్కెట్లోకి వచ్చింది. ఫిబ్రవరి 7న లాంచ్ అయ్యింది.
ఇ-లూనా ఎక్స్1, ఎక్స్2 వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్1 వేరియంట్ ధర రూ.69,990, ఎక్స్2 వేరియంట్ ధర రూ.74,990
ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో లభిస్తుంది.
ఎక్స్2 వేరియంట్లో 2kWh బ్యాటరీ ఇచ్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఎక్స్1 వేరియంట్లో 1.7kWh బ్యాటరీ ఇచ్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 80 కిలోమీటర్లు వెళుతుంది.
ఇ-లూనా టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు. ఛార్జింగ్ టైమ్ 4 గంటలు. స్వాపబుల్ బ్యాటరీ సదుపాయం ఉంది.
ఇ-లూనాలో టెలీస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు.
ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్‌స్టాండ్ సెన్సర్, యూఎస్‌బీ ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
లగేజీ తీసుకెళ్లేందుకు వీలుగా వెనుక సీటు తొలగించుకునే సదుపాయం కూడా ఉంది.
రూ.500 చెల్లించి కైనటిక్ గ్రీన్ వెబ్‌సైట్‌లో ఇ-లూనాను బుక్ చేసుకోవచ్చు.