బ్యూటీల ఫిట్‌నెస్ మంత్ర
ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లో వర్కౌట్లు చేయాల్సిందే. కేలొరీలు కరిగించాల్సిందే. ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండేందుకు సినిమా నాయికలు ఎలాంటి వర్కౌట్లు చేస్తారో చూద్దాం!
This browser does not support the video element.
జాన్వీ కపూర్
స్క్వాట్స్, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ జాన్వీ వర్కౌట్స్‌లో భాగం. హృదయ సంబంధిత వ్యాయామం, యోగా, జాగింగ్ / వాకింగ్ తప్పనిసరిగా ఉంటాయి.
This browser does not support the video element.
రష్మిక మందన
బరువులు ఎత్తడం, పుష్ అప్స్, రోస్, స్లామ్స్, బెంచ్ పుషప్స్, రోయింగ్ ఎక్సర్‌సైజులను రష్మిక రోజూ చేస్తుంది.
This browser does not support the video element.
సమంత
ఖాళీ సమయం దొరికితే జిమ్‌లోనే ఉంటుంది సమంత. సైక్లింగ్, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, పిలాటీస్ తదితర వ్యాయామాలను చేస్తుంది.
అలియా
వారంలో ఆరు రోజులు జిమ్ చేయాలి. అప్పుడే శరీరం మన మాట వింటుంది అంటోంది అలియా. స్క్వాట్స్, పిలాటీస్, కార్డియో, యోగా ఆమె ఎక్సర్‌సైజ్ రొటీన్.
This browser does not support the video element.
పూజా హెగ్డే
స్క్వాట్స్, లంగ్స్, డెడ్ లిఫ్ట్స్, పుష్ అప్స్ కండరాలను దృఢంగా మారుస్తాయి. నాజూగ్గా ఉండేందుకు సహాయపడతాయి అని అంటోంది పూజ.
This browser does not support the video element.
సారా అలీ ఖాన్
వెయిటెడ్ స్క్వాట్స్‌తో కాళ్లు, తొడల కండరాలు బలపడతాయి. సైక్లింగ్, కార్డియో వల్ల బరువు తగ్గొచ్చు. శరీరాన్ని మంచి ఆకృతిలోకి ఇవే తీసుకొస్తాయి అంది సారా.
సంయుక్త
అడ్వెంచర్లు చేయకపోతే జీవితం థ్రిల్లింగ్‌గా ఉండదు అంటోంది సంయుక్త. ట్రెక్కింగ్, గుర్రపు స్వారీ వంటివి తరచుగా చేస్తుంటుంది. ఇక యోగా, పుషప్స్, వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్ ఎలానూ ఉంటాయి.
అనుపమ పరమేశ్వరన్
సూర్యోదయాన యోగా చేస్తుంది. స్కిప్పింగ్, సైక్లింగ్ చేస్తే శరీరాకృతి చక్కగా ఉంటుంది అని చెబుతోంది అనుపమ. ఫిట్‌గా ఉండేందుకు డ్యాన్స్ చేస్తుంటుంది.
This browser does not support the video element.
మీనాక్షి చౌదరి
పుష్ అప్స్, యోగాసనాలు, కార్డియో ఎక్సర్‌సైజులు చేస్తుంది. థాయ్ బాక్సింగ్, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తుంది. స్విమ్మింగ్ కూడా ఇందులో ఉంది.