రష్మికలా ఆనందంగా ఉండాలంటే.. 

హ్యాపీ లైఫ్‌ కోసం తనదైన శైలిలో కొన్ని చిట్కాలు చెప్పింది రష్మిక. తనలా ఆనందంగా ఉండాలంటే ఈ పనులు చేసి చూడండి అంటోంది. రష్మిక చిట్కాలు ఆమె మాటల్లోనే..

గుడ్‌ఫుడ్‌..

మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. జీవితమూ సాఫీగా సాగుతుంది. 

తియ్యని వేడుక 

స్వీట్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఎప్పుడో ఒకసారి తినొచ్చు. అయితే అవి రిఫైన్డ్‌ షుగర్‌తో చేయకపోతే సరి. 

ఓ సిప్‌ ఏద్దాం..

ఉదయాన్నే కాఫీ తాగే అలవాటును కొందరు అనారోగ్యం అనుకుంటారు. కానీ కొద్దిగా తీసుకుంటే రోజంతా తాజాగా ఉండొచ్చు.

అలా తిరిగేద్దాం..

ప్రతి ఒక్కరికీ ట్రావెలింగ్‌కి ఏదో ఒక సమయంలో అవకాశం వస్తుంది. దాన్ని వినియోగించుకుంటే బోలెడంత ఆనందం మీ సొంతం.

మంచి పుస్తకంతో..

పుస్తకాలు చదవడం మంచి అలవాటు. ఓ మంచి పుస్తకం చదవడం ప్రారంభించాను అంటే.. నాకు సమయమే తెలియదు.

న్యాప్‌ వేద్దాం..

రోజు ఎంత బిజీగా గడుస్తున్నా.. ఒత్తిడి అనిపించినప్పుడు ఓ కునుకు తీయాల్సిందే. శరీరానికి సరిపడా నిద్ర లేకపోతే పని ఎలా చేస్తాం?

నచ్చిన పని..

ఏ పనిలో మనకి ఆసక్తి ఉంటే అదే చేయాలి. ఇష్టం లేని ఫీల్డులో దిగి తర్వాత రోజూ బాధ పడేకంటే.. మనసారా నచ్చిన పని చేయండి.


నవ్వాలి మరి!

బిజీ జీవితాల్లో నవ్వడమే మర్చిపోయి మూతి ముడుచుకొని కూర్చుంటున్నారు. ప్రతి దాంట్లోనూ ఓ సందర్భాన్ని వెతుక్కుని అందులోనే సంతోషాన్ని చూసుకుంటే సరి.

ప్రేమగా చూద్దాం..

పెంపుడు జంతువుల వల్ల మనలో ఉన్న పని ఒత్తిడి, అలసట దూరమవుతాయి. నాకు ఔరాతో ఆడుకోవడం సంతోషాన్నిస్తుంది.

బోర్‌ కొడితే.. బైక్‌ ఎక్కేయడమే!

సిల్క్‌ చీరలో చిలక.. తాప్సీ

ఈవారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే

Eenadu.net Home