గ్యాప్ తీసుకోలా.. వచ్చింది!
#eenadu
బాలకృష్ణ
కిందటి ఏడాది ‘భగవంత్ కేసరి’తో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘డాకు మహారాజ్’లో నటిస్తున్నారు.
చిరంజీవి
గతేడాది ‘వాల్తేర్ వీరయ్య’, ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.
పవన్ కల్యాణ్
2023లో ‘బ్రో’తో అలరించారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’లో నటిస్తున్నారు.
రామ్ చరణ్
2022లో ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఆచార్య’తో వచ్చారు. 2023లో ‘కిసీ కి భాయ్ కిసీ కి జాన్’లో అతిథి పాత్రలో కనిపించారు. ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు.
నాగచైతన్య
2022లో ‘కస్టడీ’తో అలరించారు. 2023లో ‘ధూత’ వెబ్‌సిరీస్‌తో సందడి చేశారు.. ప్రస్తుతం ‘తండేల్’, ‘NC24’లో నటిస్తున్నారు.
అడివి శేష్
రెండేళ్ల క్రితం ‘హిట్ 2’, ‘మేజర్’తో హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం ‘జీ2’, ‘డెకాయిట్’లో నటిస్తున్నారు.
నితిన్
2023లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఈ ఏడాది సినిమాలేం విడుదల కాకపోగా.. ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’లో నటిస్తున్నారు.
సాయి దుర్గా తేజ్
కిందటి ఏడాది ‘బ్రో’, ‘విరూపాక్ష’తో అలరించారు. ప్రస్తుతం ‘సంబరాల యేటి గట్టు’లో నటిస్తున్నారు.
అఖిల్
2023లో ‘ఏజెంట్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అఖిల్. ప్రస్తుతం ఓ యువ దర్శకుడితో సినిమా ఓకే చేసినట్లు సమాచారం.
నాగశౌర్య
కిందటి ఏడాది ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘రంగబలి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘పోలీస్ వారి హెచ్చరిక’, ‘నారి నారి నడుమ మురారి’లో నటిస్తున్నారు.