క్యాన్సర్‌ను జయించారు..!
#eenadu
సోనాలి బింద్రే
‘‘క్యాన్సర్ 4th స్టేజ్‌లో ఉన్నావు. నువ్వు కోలుకోవడానికి 30శాతం మాత్రమే అవకాశముందన్నారు. నేను తిరిగి సాధారణ స్థితికి వస్తానని... నాకు నమ్మకం ఉంది. ఈ వ్యాధితో బాధపడుతుంటే నమ్మకాన్ని కోల్పోవద్దు’’
హంసా నందిని
‘‘నటీనటుల భవిష్యత్తు శరీరం, వారి ఫిట్‌నెస్, మెరిసే చర్మం, యాక్టివ్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ వల్ల అవన్నీ తారుమారవుతాయి. ఫిట్‌నెస్‌ని కూడగట్టుకోవడం కష్టమైన పని. మనం తలచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది’’
మమతా మోహన్‌దాస్
‘‘మనం వ్యాధికి లొంగిపోకూడదు.. దాన్నే మన అదుపులోకి తెచ్చుకోవాలి. చుట్టు పక్కల వాళ్లు చెప్పేవి నమ్మకూడదు. మన మనసుకు తెలుసు లేచి గతంలోలా తిరుగుతామని. దాన్ని మాత్రమే నమ్మాలి’’
మనీషా కొయిరాల
‘‘ఈ జర్నీ చాలా టఫ్‌గా ఉంటుందని మనకి తెలుసు. కానీ మనం దానికంటే బలవంతులం అని మర్చిపోకూడదు. దానికి లొంగిపోకుండా జయించిన వారితో నాకు సెలబ్రేషన్స్ చేసుకోవాలనిపిస్తుంది’’
లీసా రే
‘‘నా జీవితంలో ప్రతి అంశాన్ని క్యాన్సర్ మార్చేసింది. ఈ మహమ్మారి కారణంగా చావు అంచుల దాకా వెళ్లి మళ్లీ పుట్టినట్టు అనిపించింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. అప్పుడే సమస్య నుంచి బయటపడగలం’’
తహిరా కశ్యప్
‘‘సొంతగా పరీక్ష పెట్టుకునే సమయం ఇది. క్యాన్సర్ నా నుంచి 2.0ని తీసుకొచ్చింది. చిన్న ఎదురుదెబ్బ తగిలిందని సాధించాల్సిన లక్ష్యాలు, కలల్ని మర్చిపోకూడదు. దృఢమైన సంకల్పం ఉంటే జీవితంలో దేన్నైనా గెలవగలం’’
గౌతమి
‘‘వ్యాధి బారిన పడ్డాం అని తెలిసిన తర్వాత ఆ నిజాన్ని జీర్ణించుకోవాలి. అది నిజం కాకుండా ఉంటే బాగుండేదని ఆలోచించినన్ని రోజులు, ఇతరుల దగ్గర దాచిపెట్టినన్ని రోజులు అది మనల్ని బాధిస్తూనే ఉంటుంది. అబద్ధంలో కంటే నిజంలో బతకడమే గొప్ప విషయం’’