#eenadu
ప్రపంచవ్యాప్తంగా టేస్ట్ అట్లాస్ నిర్వహించిన 100 ఫ్రోజెన్ ట్రీట్స్‌లో భారతదేశానికి చెందిన 5 ప్రముఖ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు గుర్తింపు పొందాయి. అవేంటో చూద్దామా.
కె.రుస్తుమ్ & కో కంపెనీకి చెందిన మ్యాంగో ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఫ్లేవర్ టేస్ట్ అట్లాస్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఐస్‌క్రీమ్ హౌజ్‌ని ముంబయిలో 1953 స్థాపించారు.
పబ్బాస్ ఐస్‌క్రీమ్ కంపెనీకి చెందిన లెజెండరీ గడ్బాద్‌కూ అరుదైన గౌరవం దక్కింది. పండ్లు, గింజలతో తయారు చేసే ఈ ‘గడ్బాద్’ ఐస్‌క్రీమ్ మంగళూరులో బాగా ఫేమస్. ఈ కంపెనీని 1975లో స్థాపించారు.
1984లో స్థాపితమైన నేచురల్ ఐస్‌క్రీమ్ తయారు చేసే టెండర్ కోకోనట్ ఐస్‌క్రీమ్.. తాజాగా అంతర్జాతీయ ఖ్యాతిని గడిచింది. ఈ ఐస్‌క్రీమ్ కొబ్బరి ఫ్లేవర్‌ను కలిగి ఉంటుంది.
అప్సరా ఐస్‌క్రీమ్స్‌ని 1971లో ముంబయిలో స్థాపించారు. ఈ కంపెనీకి చెందిన గూవా డిలైట్ టేస్ట్ అట్లాస్‌లో చోటు సంపాదించింది. ఈ ఐస్‌క్రీమ్‌లో జామ పండ్ల ముక్కలు, కొద్దిగా కారం తగులుతూ ఉంటుంది.
బెంగళూరులోని కార్నర్ హౌజ్ ఐస్‌క్రీమ్స్‌ని 1982లో స్థాపించారు. ఇక్కడి డెత్ బై చాక్లెట్ బాగా ఫేమస్. సాస్, నట్స్, చెర్రీస్, కేక్‌ని అనేక లేయర్లుగా పెట్టి చేస్తారు. ఈ రుచి ఇప్పుడు అట్లాస్‌కెక్కింది.