‘ఫ్యామిలీ స్టార్’తో ‘మజిలీ’ స్టార్
నాగచైతన్య ప్రేయసిగా ‘మజిలీ’తో ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’తో ప్రేక్షకులను అలరిస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమాలో మరో నాయిక మృణాల్ ఠాకూర్. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
దివ్యాంశ దిల్లీలో పుట్టింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.
చిన్నప్పుడు ‘కభీ ఖుషీ కభీ ఘమ్’లో కరీనా కపూర్ నటన చూసి.. తను కూడా నటి అవ్వాలని నిర్ణయించుకుందట.
లండన్‌లో మేకప్ ఆర్టిస్ట్ కోర్సును చేసింది. దిల్లీలో ఫ్యాషన్ అండ్ మీడియా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చదివింది.
బాస్కెట్ బాల్ ఆడటమంటే ఇష్టం. రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన దివ్యాంశ ‘మజిలీ’తో సినిమాల్లోకి వచ్చింది.
బాలీవుడ్‌లో ‘ద వైఫ్’, టాలీవుడ్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘మైఖేల్’, తమిళ్‌లో ‘టక్కర్’ చిత్రాలతో అలరించింది.
కోహ్‌సుమై ఐస్‌లాండ్, ఇండోనేషియాలోని బాలీ తదితర ప్రాంతాల సందర్శన అంటే ఇష్టం.
‘ఆహారం విషయంలో మాత్రం ఎటువంటి హద్దులూ పెట్టుకోను. ఫేవరెట్ ఫుడ్ చికెన్. దాంతో ఏ రెసిపీ చేసినా ఇష్టంగా తినేస్తాను’ అని చెబుతోంది.
This browser does not support the video element.
‘షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్లి ప్రశాంతంగా పాప్‌కార్న్ తింటూ.. సినిమాలు చూస్తుంటే ఎంత ఒత్తిడైనా ఎగిరిపోతుంది’ అంటోంది దివ్యాంశ.