‘గామి’ అందం చాందిని
‘కలర్ ఫొటో’తో హిట్ అందుకున్న చాందిని... ఆ తర్వాత వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తోంది. ‘గామి’తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.
విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ప్రచార చిత్రాలతో మెప్పించిన ఈ సినిమా థియేటర్లలో ఎంతటి సందడి చేస్తుందో చూడాలి.
‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’తో 2012లో తెలుగు తెరకు పరిచయమైంది చాందిని. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’, ‘కుందనపు బొమ్మ’, ‘శమంతకమణి’, ‘మను’, ‘హౌరా బ్రిడ్జి’ తదితర చిత్రాల్లో నటించింది.
‘కలర్ ఫొటో’లో నటనతో ప్రేక్షకుల మనసును దోచేసింది. క్లైమాక్స్‌లో నటనకైతే కుర్రకారు ఫిదా అయిపోయారు.
పద్ధతైన పాత్రలు చేస్తూ చేస్తూ ‘సమ్మతమే’లో గ్లామర్ ఒలకబోసింది. ఆ లుక్కూ అదిరిపోయింది.
విశాఖపట్నంలో పుట్టిన చాందిని మెకానికల్ ఇంజినీరింగ్ చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్‌తో కెరీర్‌ను మొదలుపెట్టింది.
‘లక్కీ’, ‘ప్రేమ ప్రేమ’, ‘రోమియో జూలియెట్’, ‘ద వీక్’, ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ తదితర లఘచిత్రాల్లో నటించింది. ‘స్వప్న’, ‘మస్తీ’ వెబ్‌సిరీస్‌తో అలరించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేస్తూ... ఇన్‌స్టాలో లైక్ బటన్లకు పని చెబుతూ ఉంటుంది.
This browser does not support the video element.
ప్రకృతితో స్నేహం చేయడం ఆమెకు ఇష్టం. విహారయాత్రలంటే చాలు జలపాతాలు, ట్రెక్కింగ్‌కే ఓటేస్తుంది.
సంప్రదాయ చీర లుక్... తన ఫేవరెట్. పండుగలు వస్తే చాలు చీర కట్టుకొని నగలు పెట్టుకొని సందడి చేస్తుంది.