నాకు అన్ని డైలాగులు ఎందుకన్నాను..!

‘ఆదిపురుష్‌’లో సీతగా కనిపించిన కృతి సనన్‌ ‘ది క్రూ’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో కరీనా కపూర్‌, టబు కూడా నటిస్తున్నారు.

‘ది క్రూ’ టీజర్‌ ఇటీవల విడుదలైంది. ముగ్గురు కథానాయికలు ఎయిర్ హోస్టెస్‌ దుస్తులతో కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది.

ఇటీవల ఈ భామ.. షాహిద్‌ కపూర్‌కు జంటగా ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’లో నటించింది. ఈ ప్రేమ కథతో హిట్‌ అందుకుంది. 

‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌’ సంస్థని స్థాపించి నిర్మాతగా మారింది. ఈ బ్యానర్‌పై రానున్న చిత్రమే.. దో పత్తి. ఇందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించింది. 

‘దో పత్తి’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల కానుంది. ‘ఈ సినిమాలో స్క్రిప్ట్‌, సంగీతం, పాత్రలు ఇలా ప్రతి విషయంలోనూ నేను భాగమైనందుకు గర్వంగా ఉంది’ అని చెబుతోంది కృతి.

 ‘సినిమాలు థియేటర్లలో విడుదలైనా, ఓటీటీ వేదికగా విడుదలైనా కథ బాగుంటే ప్రేక్షకులు తప్పక విజయాన్ని అందిస్తారు. కావాల్సింది కంటెంట్‌ మాత్రమే. కథ నచ్చితేనే సినీ ప్రియులు ఆస్వాదిస్తారు’ అని అంటుందీ ఈ భామ.

‘మిమి’ సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగింది. ఆ తర్వాత అదే సినిమాలో మరో పాట కోసం వెంటనే బరువు తగ్గాల్సి వచ్చింది. తన కృషికి ఫలితమే ‘2023 జాతీయ అవార్డు’.

కృతి పొడవుగా ఉంటుంది. అందుకే.. కెరీర్‌ ప్రారంభంలో ఆడిషన్‌కు వెళ్తే చాలా మంది రిజెక్ట్‌ చేశారంట. ‘పోను పోను అదే ప్లస్‌ అయ్యింది. ఆదిపురుష్‌ చిత్రంలో అవకాశం దక్కిందంటే నా ఎత్తు కూడా ఒక కారణమే’ అని చెబుతోంది ఈ భామ.

‘‘మహేష్‌బాబుతో కలిసి ‘1: నేనొక్కడినే’లో నటించా. అదే నా మొదటి సినిమా. తెలుగు రాకపోవడం వల్ల బాగా ఇబ్బంది పడ్డాను. ఒకసారి అయితే సుకుమార్‌ గారితో నాకు అన్ని డైలాగులు ఎందుకన్నాను’’అని చెప్పింది.

శరీరాన్ని ఫిట్‌గా ఉంచడం కోసం కఠినమైన డైట్‌ ఏదీ తను ఫాలో అవ్వదు. నచ్చినవన్నీ లాగించేసి.. దానికి తగ్గట్టుగా వ్యాయామం చేస్తుందట. నీళ్లు ఎక్కువగా తాగుతానంటోంది.

‘‘చిన్నప్పుడు ఎంతో ఇష్టంతో కథక్‌ నేర్చుకున్నా. ఇప్పటికీ రోజూ ప్రాక్టీస్‌ చేస్తాను. నేను ఇంత సన్నగా ఉండటానికి అదీ ఒక కారణమే’’నని తన ఫిట్‌నెస్‌ రహస్యం బయటపెట్టింది.

లీల... ది ‘లవ్‌ గురూ’ వైఫ్‌

వాహ్‌.. శార్వరి వాఘ్‌

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home