కాలేయం బాగుంటే అన్ని బాగున్నట్టే!

శరీరంలోని కీలక భాగాల్లో కాలేయం ఒకటి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే, కాలేయ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్‌ 19న లివర్‌ డేని నిర్వహిస్తున్నారు.  

 కారణం లేకుండా శరీరం అలసిపోవడం, బలహీనంగా మారడం, నిలబడటానికి కూడా ఒంట్లో శక్తి సరిపోకపోవడం.. ఇవన్నీ కాలేయం అనారోగ్యంగా ఉందనడానికి సంకేతాలే. 

పొత్తి కడుపు చుట్టూ పేరుకునే కొవ్వు కూడా కాలేయం దెబ్బతినడానికి కారణమవుతుంది. పూర్తిగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినా లివర్ బలహీనపడుతుంది.

చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారి కామెర్లు వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. బైలిరుబిన్‌ వడపోతలో కాలేయం ఫెయిల్ అయితే కామెర్లు వస్తాయి. తక్షణమే వైద్యులను సంప్రదించాలి.

కుడివైపున పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యంగా ఉన్నా లేదా నొప్పి తరచూ ఇబ్బంది పెట్టినా కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నదనడానికి కారణాలుగా భావించొచ్చు.

పొట్ట వాపు, కాళ్లు, మడిమల్లో నొప్పులు రావడాన్ని ఎడెమా అని పిలుస్తారు. మూత్రానికి తరచూ వెళ్లకుండా ఎక్కువ సమయం పాటు నిల్వ ఉంచడం వల్ల ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.  

 మూత్రం రంగు కూడా కాలేయ ఆరోగ్యాన్ని తెలుపుతుంది. ముదరు రంగులో ఉండే యూరిన్ అనారోగ్యమైన కాలేయాన్ని సూచిస్తుంది.  

తరచూ చర్మంపై దురద, మంట వంటివి ఇబ్బంది పెడతాయి. రక్త ప్రవాహంలో పిత్త లవణాలు పేరుకుపోవడం వల్ల చేతులు, కాళ్లపై దద్దుర్లు వస్తాయి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.  

కాలేయం బలహీనంగా ఉన్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే కారకాల ఉత్పత్తి తగ్గుతుంది. చిన్నగాయాలకు కూడా సుదీర్ఘ రక్తస్రావం జరుగుతుంది.  

ఇడ్లీ కోసమే మైసూర్‌ వెళ్లా!

అలా.. ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్‌

పెళ్లి బంధం దృఢంగా మారాలంటే ఇవి పాటించాల్సిందే!

Eenadu.net Home